Rohit Sharma on Eng vs India First test Loss | రోహిత్ చెప్పినట్లే పంత్ ఇరగదీశాడు..కానీ డకెట్ చేతిలో ఓటమి | ABP Desam
టీమిండియా 371పరుగుల టార్గెట్ ఇచ్చింది ఇంగ్లండ్ కు. మొదటి టెస్టు గెలవాలంటే ఆఖరి రోజు 350 పరుగులు చేయాలి ఇంగ్లండ్. అదేమంత ఈజీ టార్గెట్ కూడా కాదు. తక్కువ పరుగులు లానే కనిపించినా ఫోర్త్ ఇన్నింగ్స్ లో పిచ్ లు అనూహ్యం గా మారిపోతుంటాయి. సో బ్యాటర్లకు చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ హెడింగ్లే పిచ్ ఇంగ్లీష్ బ్యాటర్లకు అలాంటి కష్టాలు చూపించలేదు. ఫలితంగా బెన్ డకెట్ చెలరేగిపోయి ఆడాడు. 149 పరుగులు ఒక్కడే కొట్టి సగం లక్ష్యాన్ని సింగిల్ హ్యాండ్ తో కరిగించేశాడు. అయితే ఇప్పుడు ఇదే బెన్ డకెట్ అండ్ రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు కొట్టిన పంత్ గురించి ఓ ఫ్లాష్ బ్యాక్ వైరల్ అవుతోంది. అదేంటంటే గతేడాది ఇంగ్లండ్ టెస్ట్ జట్టు భారత్ లో పర్యటించింది. అఫ్ కోర్స్ ఇంగ్లండ్ ఓడిపోయింది అప్పుడు రోహిత్ శర్మ మనకు కెప్టెన్. లాస్ట్ టెస్ట్ కి ముందు బెన్ డకెట్ ఓ మాట అన్నాడు అప్పుడు. ఇంగ్లండ్ బాజ్ బాల్ స్టైల్ ను చూసే ఇండియా అగ్రెసివ్ గా ఆడటం నేర్చుకుంది అని. దానికి ఒళ్లు మండిన కెప్టెన్ రోహిత్ శర్మ...ఓరి బాబో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాజ్ బాల్ అంటే ఏంటో తెలియదు. రెండోది నువ్వెప్పుడూ రిషభ్ పంత్ పేరు వినలేదు అనకుుంటా అన్నాడు. పంత్ టెస్టుల్లో ఆడే తీరు ముందు ఏ బాజ్ బాల్ పనికిరాదు అని రోహిత్ శర్మ స్ట్రాంగ్ అండ్ గట్ ఫీలింగ్. ఆయన అన్నట్లుగానే ఇప్పుడు ఇంగ్లండ్ టూర్ కి వెళ్లిన పంత్ రెండు ఇన్నింగ్స్ లతో సెంచరీలు చేసి ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కానీ అనూహ్యంగా అదే బెన్ డకేట్ మనం పెట్టిన 371పరుగుల లక్ష్యాన్ని ఒంటి చేత్తో ఊదేసి మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మాటను తీసేశాలా చేశారు మనోళ్లు. బెన్ డకెట్ బాజ్ బాల్ స్టైల్ చూపించి ఇదే మా ఆటంటే చూడాలి మిగిలిన టెస్టుల్లో మనోళ్లు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చి రోహిత్ శర్మ మాటను నిలబెడతారేమో.





















