Rishabh Pant Injury Six Weeks Rest | నాలుగో టెస్టులో భారత్ కు పెద్ద ఎదురుదెబ్బ | ABP Desam
ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయపడటం ఈ సిరీస్ లో టీమిండియాకు పెద్ద దెబ్బ కొట్టేలా ఉంది. మొదటి ఇన్నింగ్స్ లో 37పరుగుల వద్ద ఉన్నప్పుడు క్రిస్ వోక్స్ బౌలింగ్ లో రివర్స్ స్వీప్ ఆడటానికి పంత్ ప్రయత్నించగా బాల్ కాలి చిటికెన వేలికి తగలటంతో మొత్తం స్వెల్లింగ్ వచ్చేసింది. నిన్ననే అంబులెన్స్ లో పంత్ ని స్కానింగ్ కి పంపించగా...స్పైడీకి ఆరు వారాల రెస్ట్ కావాలని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. ఇంకా బీసీసీఐ దీనిపై అధికారిక ప్రకటన చేయకపోయినా పంత్ స్థానంలో ధృవ్ జురెల్ ఈ టెస్ట్ ఆడతాడని...ఐదో టెస్టు కోసం ఇషాన్ కిషన్ ను ఇంగ్లండ్ కు పిలిపిస్తున్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గాయపడిన పంత్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరగ్గా ట్రీట్మెంట్ తీసుకుని మళ్లీ వస్తాడని భావిస్తున్న టైమ్ లో పంత్ సిరీస్ నుంచి రూల్డ్ అవుట్ అయితే టీమిండియాకు పెద్ద దెబ్బే పడటం ఖాయంలా ఉంది. ఎందుకంటే ఇప్పటికే గాయం కారణంగా నితీశ్ కుమార్ రెడ్డి లాంటి ఆల్ రౌండర్ సేవలు కోల్పోయిన టీమిండియా పంత్ లాంటి అటాకింగ్ ప్లేయర్, మ్యాచ్ విన్నర్ సర్వీసెస్ ను కోల్పోతే...నాలుగు ఐదు టెస్టుల్లో భారత్ బ్యాటింగ్ బలహీన పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఓవర్సీర్ కండీషన్స్ లో పంత్ ఇప్పుడున్న ఫామ్ కి తను ఆడకపోతే అది కచ్చితంగా ఇంగ్లండ్ కి అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పటికే 2-1 తో సిరీస్ లో లీడ్ లో ఉన్న ఇంగ్లండ్...మన ఆటగాళ్లను మరింత ప్రెజర్ లోకి నెట్టేసే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి పంత్ పై బీసీసీఐ అఫీషియల్ గా ఏం చెప్తుందో...పంత్ లేని టీమిండియా ఇంగ్లండ్ పిచ్ లపై ఎలా ఆడుతుందో.




















