Rishab Pant 54 vs Eng Fourth Test | గాయంతోనే హాఫ్ సెంచరీ కొట్టిన స్పైడీ పంత్ | ABP Desam
గుండెల్లో దమ్ముండాలే కానీ చిన్న చిన్న గాయాలు మనల్ని ఆపలేవు అనటానికి రిషభ్ పంతే ఉదాహరణ. ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో మొదటి రోజు రివర్స్ స్వీప్ ఆడుతుంటే కాలికి గాయమైంది. కాలి చిటికెన వేలు విరిగి స్వెల్లింగ్ వచ్చేసింది. ఇంత లావు గడ్డ కట్టింది ఆ వేలు. అస్సలు నడవలేక అంబులెన్సులో టెస్టులకు వెళ్లాడు. ఆడతాడో లేదో డౌట్. ఆరువారాలు విశ్రాంతి కావాలన్నారట డాక్టర్లు. కానీ పంత్ గుండె ధైర్యం చాలా గొప్పది. చావు అంచుల్లో నుంచి బయటపడినోడికి ఇలాంటి చిన్న చిన్న గాయాలు ఓ లెక్క. అందుకే నేరుగా డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి చెప్పాడు నేను బ్యాటింగ్ చేయగలను అని. పంత్ సంగతి అందరికీ తెలుసు. అందుకే ఎవ్వరూ ఎదురు చెప్పలేదు. దిగాడు బ్యాటింగ్ చేశాడు. జోఫ్రా ఆర్చర్ లాగి పెట్టి సిక్స్ పీకాడు. స్టోక్స్ బౌలింగ్ లో రెండు ఫోర్లు కొట్టాడు. స్టోక్స్ బౌలింగ్ లో ఫోర్ తోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. చివరికి 54పరుగుల వద్ద ఆర్చర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయినా ఎన్నో రికార్డులను బద్ధలు కొట్టాడు పంత్. పంత్ కి ఇంగ్లండ్ లో ఇది తొమ్మిదో అర్థ శతకం. తద్వారా ధోని పేరు మీదున్న ఇంగ్లండ్ లో 8హాఫ్ సెంచరీల రికార్డును బద్ధలు కొట్టాడు పంత్. అంతేకాదు ఈ సిరీస్ లో ఐదో హాఫ్ సెంచరీ కొట్టి ఓ టెస్ట్ సిరీస్ లో అత్యధిక హాఫ్ సెంచరీలు కొట్టిన వికెట్ కీపర్ బ్యాటర్ గానూ నిలిచాడు పంత్. సేనా కంట్రీస్ లో ఓ సిరీస్ లో ఎక్కువ హాఫ్ సెంచరీలు కొట్టిన వికెట్ కీపర్ గానూ పంత్ నిలిచాడు. ఈ హీరోయిక్ ఇన్నింగ్స్ చూసే ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం మొత్తం పంత్ వచ్చేప్పుడు..వెళ్లేప్పుడు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది.



















