India vs West Indies Test Match | పోరాడుతున్న విండీస్ | ABP Desam
ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ పోరాడుతోంది. మూడోరోజు ఆట ముగిసే సరికి 49 ఓవర్లలో 2 వికెట్లకు 173 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ను భారత్ 5 వికెట్లకు 518 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో 248 పరుగులకు ఆలౌట్ అయింది. 270 పరుగుల లోటుతో ఫాలో ఆన్‌లో ఆడిన వెస్టిండీస్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ త్యాగనారయణ్ చందర్ పాల్ విఫలమయ్యాడు. ఆ తరవాత అతనాజ్ ను వాషింగ్టన్ సుందర్ బౌల్డ్ చేశాడు. దీంతో 35 పరుగులకే రెండు వికెట్లకు కోల్పోయింది. ఈ దశలో క్యాంబెల్-హోప్ అద్భుతంగా ఆడారు. క్యాంబెల్.. మెల్లగా తన కెరీర్ మెయిడిన్ సెంచరీ వైపు దూసుకెళుతున్నాడు. అంతకుముందు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని 69 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో హోప్ కూడా 80 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఈక్రమంలో మూడో సెషన్ లో ఒక వికెట్ కూడా పడకుండా విండీస్ రోజును ముగించింది.





















