India Vs South Africa T20 series కు కెప్టెన్ గా K L Rahul అరుదైన ఘనత | Cricket | ABP Desam
దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్ కు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యహరిస్తున్నాడు. కేఎల్ రాహుల్ టీమిండియాకు అధికారికంగా కెప్టెన్ కాకపోయినా ఈ సంవత్సరం లో అతడికి మూడు ఫార్మాట్లలోనూ నాయకత్వం వహించే అవకాశం లభించడం విశేషం.
దక్షిణాఫ్రికాతో ఈనెల 9 నుంచి భారత జట్టు ఐదు టీ20ల సిరీస్ ఆడాల్సి ఉంది. ఇప్పటికే సన్నాహాలు కూడా ప్రారంభించింది. సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ, బుమ్రా, షమిలకు ఈ సిరీ్‌సలో విశ్రాంతి ఇచ్చిన selectors yuva ఆటగాళ్లకు అవకాశమిచ్చారు.
దీంతో యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియాకు కేఎల్ రాహుల్‌ను సారథిగా నియమించారు. అయితే ఈ సంవత్సరం జనవరిలో సఫారీ టూర్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ దూరం కావడంతో వన్డే సిరీ్‌సకు రాహుల్‌కు బాధ్యతలు ఇచ్చారు.
అప్పట్లో వన్డే కెరీర్‌లో 50 మ్యాచ్‌లకు ముందే కెప్టెన్‌గా చేసిన రెండో భారత క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్నాడు రాహుల్. మొహిందర్ అమర్‌నాథ్ తన 35వ వన్డేలోనే ఈ ఫీట్ సాధించగా.. రాహుల్ 39వ వన్డేలో జట్టును నడిపించాడు. ఇక అదే పర్యటనలో రెండో టెస్టుకు కూడా కేఎల్ కెప్టెన్‌గా వ్యవహరించాల్సి వచ్చింది.
కేఎల్ రాహుల్‌రాహుల్ ఈనెల 9న టీ20 ఫార్మాట్‌లో తొలిసారిగా కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. అప్పటికి అతని వయసు 30 ఏళ్ల 52 రోజులుగా ఉండనుంది. దీంతో ఈ ఘనత సాధించిన ఐదో పిన్న వయస్కుడిగా రాహుల్ నిలువనున్నారు.