Ind vs WI 2nd Test | బౌండరీ లైన్ దగ్గర బర్గర్ తింటూ కూర్చొన్న ఈ స్టార్ట్ బ్యాటర్ ఎవరో గుర్తుపట్టారా? | ABP Desam
బౌండరీ లైన్ బయట కూర్చుని బర్గర్ తింటున్న ఈ పర్సన్‌ని చూడగానే.. ఎవరో బాల్ బాయ్ అనుకున్నారా..? కానీ జాగ్రత్తగా చూడండి. అతడు టీమిండియా యంగ్ సెన్సేషన్ సాయి సుదర్శన్. విండీస్‌తో రెండో టెస్ట్ సందర్భంగా ఇలా బౌండరీ లైన్ దగ్గర కూర్చుని బర్గర్ తింటూ కెమెరాకి దొరికాడు. అయితే ఈ వీడియోలో కొంతమంది ఫ్యాన్స్ సాయి సుదర్శన్‌ని ఉద్దేశించి.. ‘గుజరాత్ వదిలెయ్.. మాకు సీఎస్‌కేలో నువ్వు కావాలి’ అంటూ పెద్దగా అరుస్తున్న వాయిస్ వెనుక నుంచి వినపడుతోంది. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. అండ్ ఈ వీడియో చూసిన చాలామంది సీఎస్కే ఫ్యాన్స్ కూడా.. అవును.. ’సుదర్శన్ సీఎస్కేలోకి వచ్చేయాలి, సుదర్శన్ లాంటి ఓపెనర్ అవసరం చెన్నై టీమ్‌కి చాలా ఉంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమందైతే నెక్ట్స్ వేలంలో మనోడు సీఎస్కే ఎంట్రీ పక్కా.. అంటూ ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ కూడా చెబుతున్నారు. ఇంకొంతమంది మాత్రం.. పాపం పిల్లోడిని ప్రశాంతంగా బర్గర్ అయినా తిననివ్వండయ్యా అంటూ సెటైర్లు వేస్తున్నారు. కానీ.. ఒక్కటి మాత్రం నిజం.. ఆల్రెడీ 2 సీజన్ల నుంచి ఓపెనర్ కొరతతో ఇబ్బంది పడుతున్న సీఎస్కేలోకి ఒకవేళ సాయి సుదర్శన్ ఎంట్రీ ఇస్తే.. నిజంగానే ఆ జట్టుకి సాలిడ్ ఓపెనర్ దొరికినట్లవుతుంది. ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ సుదర్శన్‌కి బాగా కలిసొచ్చింది. గత 7 టెస్ట్ మ్యాచ్‌లుగా చెప్పుకోదగ్గ స్కోర్స్ చేయలేకపోయిన సుదర్శన్.. టెస్ట్ జట్టులో స్థానం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అలాంటి టైంలో రెండో టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 87 రన్స్ చేసి.. ప్లేస్ కాపాడుకున్నాడు. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో 39 రన్స్ రన్స్‌కే అవుటైనా.. టెస్ట్ మ్యాచ్‌ల్లో మనోడికి ఇంకొన్ని ఛాన్స్‌లు మాత్రం వచ్చే అవకాశాలు లేకపోలేదు.





















