Greg Chappell Praises Siraj | సిరాజ్ ను పొగడ్తలతో ముంచెత్తిన గ్రెగ్ ఛాపెల్ | ABP Desam
వివాదాస్పద కోచ్ గా టీమిండియాకు ఎప్పటికీ గుర్తుండిపోయే గ్రెగ్ ఛాపెల్ సిరాజ్ మియాను ప్రశంసలతో ముంచెత్తాడు. టెస్ట్ క్రికెట్ లో బుమ్రా ఉన్నా లేకున్నా లీడర్ అంటే ఎప్పటికీ మహ్మద్ సిరాజ్ అన్నాడు గ్రెగ్ ఛాపెల్. మియా భాయ్ ఫిట్ నెస్ లెవల్స్ ను మెచ్చుకున్న ఈ ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు...నెంబర్స్ ను చూసి బౌలర్ గొప్పతనం చెప్పలేము అన్నాడు. ఐదు టెస్టులు ఉంటే ఐదు ఆడాలన్న తపన లేకపోతే క్రికెటర్ గా రాణించలేరన్న గ్రెగ్ ఛాపెల్..టీమ్ కు ఎప్పుడు అవసరం ఉన్నా ముందు నిలబడే సిరాజ్ సిసలైన నాయకత్వ లక్షణాలు ఉన్నవాడని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ తో ఐదు టెస్టులు ఆడి 23 వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్ ఈ సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలవగా..ఓవల్ టెస్ట్ లో అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ ను గెలిపించి సిరీస్ 2-2 తో డ్రా అవ్వటంలో కీలకపాతర్ పోషించాడు. ప్రత్యేకించి సిరాజ్ తీసిన వికెట్లలో 80శాతం విదేశీ పిచ్ ల్లోనే రావటంతో...బుమ్రా కంటే గ్రేట్ బౌలర్ అంటూ విదేశీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నా...బుమ్రా 34 టెస్టులు విదేశాల్లో ఆడి 159 వికెట్లు తీస్తే..సిరాజ్ 23 టెస్టులు విదేశాల్లో ఆడి 91 వికెట్లు తీశాడు. 11 సార్లు బుమ్రా 5వికెట్లు తీస్తే...సిరాజ్ 4 సార్లు మాత్రమే తీశాడు. అయితే బుమ్రా లేని టెస్టుల్లో సిరాజ్ బాధ్యత తీసుకుంటున్నాడనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే బుమ్రా ఆడని గడచిన నాలుు విదేశీ టెస్టుల్లో సిరాజ్ ఒక్కడే 27వికెట్లు తీశాడు.





















