Vande Metro Roll out Started | వందే మెట్రో ట్రయల్‌కు గ్రీన్ సిగ్నల్ | ABP Desam
భారతదేశంలో మొట్టమొదటి వందే మెట్రో రైలు ట్రయల్స్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో దీనికి సంబంధించిన రోల్ అవుట్‌ను ప్రారంభించారు. దీని బేసిక్ యూనిట్‌ను కపుర్తలా లో ఉన్న రైల్ కోచ్ ఫ్యాక్టరీలో రూపొందించారు. ఈ ట్రైన్‌లో ఉన్న ఫీచర్లన్నీ వందే భారత్ ట్రైన్ తరహాలోనే ఉన్నాయి. అసలు ఈ వందే మెట్రో అంటే ఏంటి? వందే భారత్‌కు, వందే మెట్రోకు తేడా ఏంటి? వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లకు షార్ట్ డిస్టెన్స్ వేరియంట్లే ఈ వందే భారత్ మెట్రో అని చెప్పవచ్చు. 100 నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాల మధ్య వేగంగా ప్రయాణం చేసేందుకు ఈ వందే భారత్ మెట్రో ఉపయోగపడనుంది. 124 నగరాలను ఈ వందే మెట్రో నెట్‌వర్క్ కవర్ చేయనుంది. ఢిల్లీ టు రెవారీ, ఆగ్రా టు మధుర, లక్నో టు కాన్పూర్, భువనేశ్వర్ టు బాల్సోర్, తిరుపతి టు చెన్నై... ఇలా పలు రకాల రూట్లలో ఈ వందే మెట్రో రైళ్లు నడవనున్నాయి. తక్కువ ధరలో వేగవంతమైన ప్రయాణాన్ని అందించడమే వందే మెట్రో లక్ష్యం.