Vanama Raghava: ఆరునెలల క్రితమే న్యాయం జరిగి ఉంటే...నాలుగు ప్రాణాలు నిలిచేవి
వనమా రాఘవ వేధింపులకు ఆరునెలల క్రితం పాల్వంచ పట్టణానికి చెందిన మలిపెద్ది వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఆత్మహత్య కు పాల్పడ్డాడు. తన సూసైడ్ నోట్ లో రాఘవ తో పాటు 42 మంది పేర్లు రాసినప్పటికి కేసు నమోదు చేశారు తప్ప ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. వెంకటేశ్వర్లుకు చెందిన భూమి విషయంలో రూ. 10 లక్షలు తీసుకొని, వేరేవారికి మద్దతు పలికాడు. దీంతో పాటు వేరే కేసులో ఇరికించి జైలుకు పంపడంతో వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసు లో పోలీసుల పైన ఆరోపణలున్నాయి. ఆరు నెలల క్రితం జరిగిన ఈ ఆత్మహత్యపై జాప్యం చేశారని భాదితులు పేర్కొంటున్నారు. అప్పుడే సరైన శిక్ష వేస్తే ఇప్పుడు రామకృష్ణ కుటుంబం బ్రతికి ఉండేదని, ఇప్పటికైనా ప్రభుత్వం రాఘవ పై చర్యలు తీసుకొని తమ లాంటి వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు.





















