Minister Gangula: కరీంనగర్ జిల్లాలో తొలిసారిగా డబుల్ బెడ్ రూం ఇళ్ల గృహప్రవేశం
డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపుతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నిండాయని రాష్ట్ర పౌర సరఫరాలు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కొత్తపెల్లి మండలం కమాన్ పూర్ గ్రామంలో నిర్మించిన 67 డబుల్ బెడ్ రూం ఇండ్లను జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తో కలిసి మంత్రి లక్కీ డ్రా ద్వారా లబ్దిదారులకు కేటాయించి గృహ ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలోనే కొత్తపెల్లి మండలం కమాన్ పూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇండ్లను లబ్దిదారులకు పంపిణీ చేశామని ఆయన తెలిపారు. నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లకు విద్యుత్ మీటర్లు, త్రాగునీటి సరఫరా కల్పించినట్లు ఆయన అన్నారు. నిరుపేద ప్రజలకు డబుల్ బెడ్ రూం ల సొంత ఇండ్ల కల సాకారం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ తండ్రి లాంటి వాడని దైవంతో సమానమని, దైవ స్వరూపులని అన్నారు.




















