అన్వేషించండి
Kasi Viswanath :కాశీవిశ్వనాధ్ ఆలయంలో పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లిన దొంగలు
దేవాలయంలో దేవుని వెండి పంచలోహ విగ్రహాలను దోచుకెళ్లి పోలీసుల కు సవాలు గా విసురుతున్నారు దొంగలు. ఇలాంటి సంఘటన దుండిగల్ పి.యస్ పరిధి సురారం గ్రామంలోని లక్ష్మీనగర్ కాలనీ లో గల కాశీవిశ్వనాధ్ ఆలయంలో జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఆలయం తాళాలు పగలగొట్టి ఆరు పంచలోహ విగ్రహాలను దొంగలు ఎత్తుకెళ్లారు.వేకువజామున పూజకు పూజారి వచ్చిన సమయంలో తలుపు గడి పగలగొట్టినట్లు గ్రహించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. దొంగలు విగ్రహాల తో పాటు హుండి ని పగలగొట్టి నగదును దోచుకెళ్లినట్లు పూజారి మోహన్ శర్మ తెలిపాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ





















