TATA Group Power Struggle Explained | ఆధిపత్యం కోసం టాటా సంస్థల్లో అంతర్యుద్ధం | ABP Desam
టాటా సంస్థ పేరు చెబితే చాలు..మన దేశంలో దాన్ని ఓ కంపెనీలా ఎవరూ చూడరు. దేశానికి సొంతమైన ఓ ఆస్తిలా ప్రజలు భావిస్తారు. ట్రస్ట్, ట్రెడీషన్, టైమ్ లెస్ లెగసీ కి టాటా అనే పేరు ఓ చిరునామా. దేశం కష్టాలను ఎదుర్కొన్న ప్రతీసారి నిస్వార్థంగా ప్రజల కోసం వేల కోట్ల రూపాయలు భూరివిరాళం ఇచ్చిన గొప్ప చరిత్ర టాటా సంస్థల సొంతం. అందుకే ఎన్ని తరాలు మారినా..ఎన్ని ప్రొడక్ట్స్.... టాటా సంస్థల నుంచి బయటకు వచ్చినా మన దేశ ప్రజలు అన్నింటినీ దేశభక్తితో ఆదరిస్తూనే ఉంటారు. అంతటి పేరున్న టాటా సంస్థల్లో ఇప్పుడు కలకలం మొదలైంది. ఇన్నాళ్లూ టాటాలకు కట్టప్పలా ఉన్న ఓ అనుబంధ సంస్థ ఇప్పుడు టాటా సామ్రాజ్యంపై ఏకంగా యుద్ధాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఏంటా యుద్ధం..అసలు టాటా సంస్థకు ఏమైంది..ఈ వీడియోలో తెలుసుకుందాం.
టాటా పేరుతో ఎన్ని సంస్థలు ఉన్నా...ఎన్ని ప్రొడక్ట్స్ వచ్చినా వాటన్నింటికీ మాతృసంస్థ టాటా సన్స్. టాటా సన్స్ కనుసన్నల్లోనే అనుబంధ సంస్థలన్నీ పనిచేస్తుంటాయి. టాటా సంస్థల ప్రిన్సిపల్ ఇన్వెస్ట్ మెంట్ హోల్డింగ్ కంపెనీగా...టాటా కంపెనీల ప్రమోటర్ గా వ్యవహరించేది టాటా సన్స్ సంస్థనే. అంటే టాటా సంస్థలైన టీసీఎస్ సాఫ్ట్ వేర్ కంపెనీ, జాగ్వార్, ల్యాండ్ రోవర్, టాటా స్టీల్ ఇవన్నీ టాటా సన్స్ పరిధిలోనే ఉంటూ స్వతంత్రంగా పనిచేస్తూ ఉంటాయి.నటరాజన్ చంద్రశేఖర్ టాటా సన్స్ కి ప్రస్తుతం ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. అయితే ఇక్కడే ఆసక్తికరమైన విషయం ఏంటంటే టాటా సన్స్ లో 66శాతం వాటాలు... టాటా ట్రస్ట్ పేరు మీద ఉంటాయి. టాటా ట్రస్ట్ అనేది టాటాల కుటుంబం నడిపే ఓ ఛారిటబుల్ ట్రస్ట్. ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు చేయని ఓ చారిట్రబుల్ ట్రస్ట్ పేరు మీదే టాటా వ్యాపార సామ్రాజ్యంలో 66శాతం వాటాలు పెట్టడం అంటే టాటాల పూర్వీకుల ముందు చూపుకు ఓ నిదర్శనం అని చెప్పుకోవచ్చు.
సరిగ్గా ఇక్కడే ఇప్పుడు ఇష్యూ మొదలైంది.





















