CWC Members Visit: శ్రీశైలం జలాశయం భద్రతపై పాండ్యన్ నేృతత్వంలో కమిటీ పరిశీలన
శ్రీశైలం జలాశయం భద్రతపై పాండ్యన్ నేతృత్వంలో సుమారు 15 మంది సీడబ్ల్యూసీ కమిటీ సభ్యులు శ్రీశైలం ప్రాజెక్ట్ ను పరిశీలించారు. జలాశయానికి చేరుకున్న కమిటీ సభ్యులు రేడియల్ క్రెస్టు గేట్లు వాటి పనితీరు,గ్యాలరీ పరిశీలించి.... అక్కడి నుండి డ్యామ్ ముందు భాగంగా ఏర్పడిన ప్లాంజ్ ఫుల్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుండి ఏపీ కుడిగట్టు జలవిద్యుత్ రక్షణ గోడను పరిశీలించారు. అనంతరం జలాశయం సీఈ మురళీ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు నిధులతో శ్రీశైలం డ్యామ్ కు మరమ్మతులు చేయనున్నట్లు చెప్పారు. డ్రిప్ 2 పథకం కింద డ్యామ్ మరమ్మతులకు నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. దీని సంబంధించి కేంద్ర ప్రభుత్వం 70 శాతం రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం చెల్లించాల్సివుంటుందన్నారు. ఇప్పటి వరకు జలాశయం పైన మాత్రమే చూశామని కమిటీ సభ్యులు,అధికారులు కలిసి జలాశయంపై చేసిన వివిధ సర్వేలు,వీడియోగ్రాఫి,ఫోటో గ్రఫీ ద్వారా సమీక్ష నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.