Rajinikanth Watched Kannappa | సూపర్ స్టార్ రజినీకాంత్ కు కన్నప్ప చూపించిన మంచు ఫ్యామిలీ | ABP Desam
మంచు విష్ణు తన కన్నప్ప సినిమాను సూపర్ స్టార్ రజినీకాంత్ కుటుంబానికి చూపించారు. రజినీకాంత్ దంపతులకు స్పెషల్ షో వేసి మరీ కన్నప్ప సినిమాను ప్రదర్శించారు. సినిమా చూసిన రజినీ కాంత్ మంచు విష్ణును హగ్ చేసుకుని ప్రశంసించారు. ఇదే సందర్భంగా మోహన్ బాబు 50వ ఏళ్ల చిత్ర పరిశ్రమ వేడుకలను కూడా నిర్వహించారు. కేక్ కట్ చేసిన రజినీకాంత్ నువ్వు పెదరాయుడువైతే నేను పాపారాయుడుని అంటూ మోహన్ బాబుతో ఫన్ జనరేట్ చేశారు. 'కన్నప్ప' ట్రైలర్ ఇటీవల రిలీజ్ కాగా అదిరిపోయింది. చిన్నప్పటి నుంచీ శివున్ని ద్వేషించే తిన్నడు.. పరమ శివ భక్తుడిగా ఎలా మారాడు?, పరమ పవిత్రమైన, మహిమ గల వాయులింగాన్ని కాపాడేందుకు తిన్నడు ఏం చేశాడు?, అనేదే ఈ మూవీ స్టోరీ అని తెలుస్తోంది. మకేష్ కుమార్ సింగ్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. ప్రతీ ముకుందన్ హీరోయిన్‌గా నటించారు. మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, కాజల్, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం, సప్తగిరి కీలక పాత్రలు పోషించారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ నెల 27న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.




















