Akhil "Lenin" Movie Heroine | అఖిల్ అక్కినేనికి తప్పని సినిమా కష్టాలు
హీరో అక్కినేని అఖిల్, శ్రీలీల జంటగా తెరకెక్కుతోన్న చిత్రం లెనిన్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే నిన్నటి వరకు ఈ సినిమా హీరోయిన్ శ్రీ లీల అని అందరు అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం కాదు. ప్రస్తుతం ఈ సినిమాలో అఖిల్ సరసన నటించబోతుంది భాగ్యశ్రీ బోర్సే.
రీసెంట్ గా రిలీజ్ చేసిన 'లెనిన్' గ్లింప్స్ లో శ్రీ లీల కనిపించారు. ఈ సినిమా కోసం ఎనిమిది రోజుల పాటు ఆవిడ షూటింగ్ కూడా చేశారు. మేజర్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యే సరికి డేట్స్ అడ్జస్ట్ చేయలేనని శ్రీ లీల తప్పుకొన్నారు.
ప్రస్తుతం శ్రీలీల పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’, రవితేజతో ‘మాస్ జాతర’ సినిమాలో నటిస్తుంది. దాంతో పాటు బాలీవుడ్ సినిమా 'ఆషికి 3'తో పాటు ఇంకా తమిళ సినిమాలు చేతిలో ఉన్నాయి. ఈ సమయంలో అఖిల్ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేక సారీ చెప్పేశారు. ఆ ఛాన్స్ భాగ్యశ్రీ బోర్సే అందుకున్నారు.
మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ బోర్సే. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో 'కింగ్‌డమ్', రామ్ పోతినేని 'ఆంధ్రా కింగ్ తాలూకా', దుల్కర్ సల్మాన్ - రానా దగ్గుబాటిల 'కాంత' సినిమాలో నటిస్తుంది భాగ్యశ్రీ. ఇప్పుడు అఖిల్ 'లెనిన్' ఓకే చేశారు. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలో ఆవిడ చేతిలో ఉన్నాయి.





















