1 Rupee Dosa: అనంతపురం లో అవ్వ "రూపాయి దోశలు" ఫేమస్...
అనంతపురం జిల్లా తాడిపత్రి వాసులను రూపాయి కి ఏమి వస్తుందని అడిగితే మాత్రం తడుముకోకుండా సావిత్రమ్మ దోశ అని చెబుతారు. అవును సావిత్రమ్మ దోశ అంటే తాడిపత్రిలో అంత ఫేమస్ మరి. ఆ ప్రాంతంలో అవ్వ దోశలు అంటే తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంత ఫేమస్ కావడానికి మరో కారణం వుంది. 1985 నుంచి సావిత్రమ్మ దోశలు వేస్తు జీవనం సాగిస్తోంది. అప్పట్లో పావలాకు ఒక దోశ ఇచ్చేది.కానీ ఇప్పుడు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తప్పని పరిస్థితులలో దోశ ధర కూడా పెంచక తప్పలేదు. అవ్వ దోశ రూపాయి వద్ద స్థిరంగా నిలబడి పోయింది. దోశ వ్యాపారంలో వచ్చిన డబ్బుతోనే తన ముగ్గురు పిల్లలను పెంచి పోషించింది. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసింది. కుమారున్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకున్ని చేసింది. విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో కూడా దోశలు వేస్తూ కష్టపడి సంపాదించే రూపాయి వెనుక ఉండే ఆనందాన్ని పొందుతుంది.