By: ABP Desam | Updated at : 22 Feb 2023 06:52 PM (IST)
హిజ్రాలకు షర్మిల క్షమాపణలు - వారు తనకు అక్కచెల్లెళ్ల లాంటి వారన్న వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు !
Sharmila On Hijras : హిజ్రలు తన అక్కచెల్లెళ్లు అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు. వారికి బాధ కలిగి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణ వేడుకుంటున్నానని ప్రకటించారు. అంతేకాదు... వైఎస్ఆర్ టీపీ అధికారంలోకి వస్తే వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు.. వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఉచిత హామీ ఇచ్చారు. దీనికి కారణం మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా హిజ్రాలు షర్మిలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్నారు. ఆమె ఫ్లెక్సీలను చెప్పుతో కొడుతూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను విమర్శించే క్రమంలో హిజ్రాలను ఉదాహరణగా చూపిస్తే షర్మిల వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యల కారణంగానే ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచరులు ఆందోళనలు చేయడం.. ఉద్రిక్తతల కారణంగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి హైదరాబాద్‌లో వదిలి పెట్టారు. పాదయాత్రకు అనుమతులు రద్దు చేశారు. హబూబాబాద్ పాదయాత్రలో వైఎస్ షర్మిల శంకర్ నాయక్ ను కొజ్జా అంటూ ఘాటుగా విమర్శించారు. శంకర్ నాయక్ తనను శిఖండి అని కొజ్జా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడిన షర్మిల ఎవడ్రా కొజ్జా.. హామీలు అమలు చేయని నువ్వు కదా కొజ్జా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రైతు రుణమాఫీ చెయ్యని మిమ్మల్ని కొజ్జాలు కాకుంటే మరేమంటారు అంటూ ప్రశ్నించారు. ఆరు నెలల్లో పోడు పట్టాలు ఇవ్వని మీరు కొజ్జాలు కాకపోతే మరేమవుతారు అంటూ వైయస్ షర్మిల తీవ్ర స్థాయిల వ్యాఖ్యలు చేశారు.
ఆ వ్యాఖ్యలు తీవ్రంగా ఉండటంతో హిజ్రాలు వైయస్ షర్మిల తమపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. వైయస్ షర్మిల తక్షణం తమకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. హిజ్రాలను చిన్నచూపు చూడాల్సిన అవసరం లేదని, హిజ్రాలలో చదువుకున్న వారు, విద్యావంతులు, మేధావులు ఎందరో ఉన్నారని, హిజ్రాలు నేడు సమాజంలో మిగతా కమ్యూనిటీలలానే గౌరవప్రదంగా జీవిస్తున్నారని హిజ్రాల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లైలా ప్రకటించారు. హిజ్రాల గురించి మాట్లాడేటప్పుడు వారి జీవితం ఏంటో వారితో కలిసి ఉండి తెలుసుకోవాలని, నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజకీయ నాయకులు రాజకీయాలు చేసుకోవచ్చు కానీ కొజ్జా.. కొజ్జా అంటూ తమ కమ్యూనిటీని కించపరిచి మాట్లాడితే ఊరుకునేది లేదని హిజ్రాలు హెచ్చరించారు. ఈ నిరసనలు అంతకంతకూ పెరుగుతూండడటంతో షర్మిల బేషరతుల క్షమాపణలు చెప్పారు.
తెలంగాణలో శాంతిభద్రతలు లేవని.. రాష్ట్రపతి పాలన విధించాలని షర్మిల డిమాండ్ చేశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి తాను మరోసారి పాదయాత్రను చేస్తానని ప్రకటించారు.
గన్నవరం ఘటనలపై టీడీపీది దుష్ప్రచారం - చంద్రబాబు బీసీల్ని మోసం చేస్తున్నారన్న సజ్జల !
Minister KTR : తెలంగాణపై కేంద్రం పగబట్టింది, రూ.1200 కోట్ల ఉపాధి హామీ నిధులు తొక్కిపెట్టింది- మంత్రి కేటీఆర్
CM KCRకు బండి సంజయ్ లేఖ- విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్
Breaking News Live Telugu Updates: కాంగ్రెస్ పార్టీకి డీఎస్ రాజీనామా
KTR Convoy: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ - కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత
Hyderabad News : పెళ్లైన రెండేళ్లకే దారుణం, కుటుంబ కలహాలతో ట్రాన్స్ జెండర్లు ఆత్మహత్య!
Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!
Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!
Game Changer First Look: స్టైలిష్ లుక్ లో రామ్ చరణ్, ఇరగదీసిన ‘గేమ్ చేంజర్’ పోస్టర్
Rapaka Varaprasad: నేను దొంగ ఓట్ల వల్లే గెలిచా, ఒక్కొక్కరు 10 దాకా ఫేక్ ఓట్లేశారు - ఎమ్మెల్యే రాపాక