Cm Kcr: యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ సోమవారం పరిశీలించారు. కాలినడకన ఆలయం చుట్టూ తిరుగుతూ నిర్మాణ పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు.
యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటించారు. హెలికాప్టర్‌లో యాదాద్రి ఆలయం చుట్టూ విహంగవీక్షణం చేశారు సీఎం కేసీఆర్. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ఆలయ పరిసరాలలో కలియతిరిగిన సీఎం కేసీఆర్ అభివృద్ధి పనులపై ఆరా తీశారు. యాదాద్రి ప్రధాన ఆలయం, గర్భగుడిని సీఎం కేసీఆర్ పరిశీలించారు. కాలినడకన ఆలయం చుట్టూ తిరిగిన కేసీఆర్ అధికారలకు పలు సూచనలు చేశారు. అనంతరం బాలాలయంలో లక్ష్మీనరసింహ స్వామిని ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్ కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి ఉన్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగమైన ప్రధాన ఆలయం, యాగస్థలం, కోనేరు, రహదారులను ముఖ్యమంత్రి పరిశీలించారు. మార్చి 28న నిర్వహించనున్న మహా కుంభ సంప్రోక్షణ, సుదర్శన యాగం ఏర్పాట్లపై అధికారులతో సీఎం సమీక్షించారు.
ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఈ రోజు మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా యాదాద్రి చేరుకుని ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు.
— TRS Party (@trspartyonline) February 7, 2022
దాదాపుగా పూర్తికావస్తున్న ఆలయ పరిసరాలను కలియ తిరుగుతూ పునర్నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. pic.twitter.com/ZbuMnOapAj
కళ్యాణ కట్ట, పుష్కరిణీ పనులను పరిశీలించిన సీఎం
సోమవారం మధ్యాహ్నం యాదాద్రికి చేరుకున్న ముఖ్యమంత్రి ముందుగా ఏరియల్ వ్యూ ద్వారా ఆలయాన్ని పరిశీలించారు. అనంతరం లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బాలాలయంలో లక్ష్మీనరసింహస్వామికి సీఎం కేసీఆర్ పూజలు చేశారు. అర్చకులు సీఎంకు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ ఈవో స్వామివారి ప్రసాదాన్ని కేసీఆర్ కు అందజేశారు. కళ్యాణ కట్ట, పుష్కరిణీ నిర్మాణ ఏర్పాట్లను సీఎం కేసీఆర్ పరిశీలించారు. మంత్రులు, అధికారులకు పలు సూచనలు చేశారు. 75 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్వహించనున్న సుదర్శన యాగం ఏర్పాట్లు, అన్నదాన సత్రాలు, ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణాలను సీఎం పరిశీలించారు. పుష్కరిణీ వద్ద స్నానం ఆచరించేందుకు పురుషులకు, స్త్రీలకు విడివిడిగా స్నానపు గదుల నిర్మాణాల చేపడుతున్నారు. ఈ పనులను సీఎం అడిగి తెలుసుకున్నారు. వ్రత మండపాలు, దీక్షాపరుల మండపాల నిర్మాణాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. సీఎం కేసీఆర్ వెంట ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి ఉన్నారు.