అన్వేషించండి

Jupally Krishna Rao: తెలంగాణ‌లో ఎకో, టెంపుల్, మెడిక‌ల్ టూరిజంపై ప్రభుత్వం ఫోకస్ - అభివృద్ధి చేయనున్న ప్రాంతాలివే

TG Tourism Minister Jupally : తెలంగాణ‌లో ఎకో, టెంపుల్, మెడిక‌ల్ టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని పర్యాటక, సాంసృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Telangana Minister Jupally Krishna Rao: పర్యాటక రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపడంతో పాటు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని పర్యాటక, సాంసృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే అత్యుత్తమ పర్యాటక, ఆతిథ్య ఉన్నత విద్యా, శిక్షణ సంస్థగా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ (నిథమ్‌) ను తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.  ప‌ర్యాట‌క కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్ది.. ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడం.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కొత్త ప‌ర్యాట‌క విధాన ముసాయిదా రూపొందించామన్నారు మంత్రి జూప‌ల్లి. డా. బీఆర్. అంబేడ్కర్ సచివాలయంలోని మీడియా సెంటర్ లో విలేక‌రుల స‌మావేశంలో పాల్గొన్నారు

పర్యాటక రంగం పట్ల నిర్లక్ష్యం
గ‌డిచిన ప‌దేళ్లలో పర్యాటక శాఖ ఉందన్న విషయమే మర్చిపోయామని, పర్యాటక రంగ అభివృద్ధికి ఓ ప్రత్యేక పాలసీ అంటూ లేకుండా పోయిందన్నారు. పర్యాటక రంగాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. తారామ‌తి బ‌రాద‌రి, హ‌రిత హోటల్స్ నిర్వహణ అద్వాన్నంగా తయారైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తుందని.. ఆరు నెలల్లోనే పురోగతి సాధిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను రాబట్టడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందన్నారు. 

పర్యాటకానికి అధిక ప్రాధాన్యం 
సీఎం రేవంత్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఎకో, టెంపుల్, మెడిక‌ల్ టూరిజంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించినట్లు జూపల్లి తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కొత్త ప‌ర్యాటక విధాన ముసాయిదాను సిద్ధం చేశామ‌ని, ముఖ్యమంత్రి సలహాలు సూచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. త్వరలోనే కేంద్ర ప‌ర్యాట‌క, సాంస్కృతిక‌ శాఖ మంత్రిని క‌లిసి తెలంగాణ ప‌ర్యాట‌క అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరనున్నట్లు చెప్పుకొచ్చారు. 

ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం 
ప్రభుత్వ- ప్రైవేట్ భాగ‌స్వామ్యంలో ప‌ర్యాట‌క ప్రదేశాలను అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పించడం ద్వారా ఆదాయం పొందే మార్గాలను అన్వేషిస్తున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు, చారిత్రక వారసత్వ సంపదకు నెలవు అని, ఎన్నో వ‌న‌రులు ఉన్నా ఆశించిన స్థాయిలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.  వ‌న‌రులు లేని  సింగాపూర్, దుబాయ్, ఆఫ్రికా లాంటి దేశాలు... త‌మ ప్రధాన ఆదాయ వ‌న‌రుగా ప‌ర్యాట‌క రంగాన్ని తీర్చిదిద్దుకున్నాయని  పేర్కొన్నారు. తెలంగాణ‌ను ప‌ర్యాట‌కాన్ని అంత‌ర్జాతీయ  స్థాయిలో తీర్చిదిద్ది... లోక‌ల్ టు గ్లోబ‌ల్ టూరిస్ట్ ల‌ను  ఆక‌ర్శించేలా చర్యలు చేపడుతామన్నారు.  కృష్ణాన‌ది బ్యాక్ వాట‌ర్ లో  సోమ‌శిల‌ను డెస్టినేష‌న్ వెడ్డింగ్, స‌హ‌స ప‌ర్యాట‌కానికి అనువైన ప్రదేశంగా గుర్తించామన్నారు.  డెస్టినేషన్ వెడ్డింగ్ ప్రమోట్ చేసేందుకు.. రామప్ప, లక్నవరం, నాగార్జున సాగర్, అనంతగిరి హిల్స్ వంటి పలు ప్రదేశాలను అభివృద్ధి చేస్తామన్నారు.  అనంత‌గిరిలో వెల్నెస్ టూరిజం రిసార్ట్‌ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.  

అంతర్జాతీయ స్థాయిలో బుద్ధవనం
బుద్ద గ‌యా త‌ర‌హాలో అంత‌ర్జాతీయ స్థాయిలో నాగ‌ర్జున సాగ‌ర్ లోని బుద్ధవనాన్ని తీర్చిదిద్దుతామన్నారు.  తద్వారా తూర్పు, ద‌క్షిణ దేశాల పర్యాట‌కుల‌ను ఆకర్షిస్తామని మంత్రి తెలిపారు.   గ‌త ప్రభుత్వంలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ (నిథమ్‌) ప్రతిష్ట మసకబారిందన్నారు.  గ‌తంలో 800 పైగా స్ట్రెంత్ ఉంటే.. ఇప్పుడు 200కు పడిపోయిందన్నారు. దీనికి పూర్వ వైభ‌వం తీసుకువ‌స్తామ‌ని అన్నారు.   పురాత‌న క‌ళ‌ల‌ను ఒక గొడుగు క్రింద‌కు తెచ్చి.. పేరిణి లాంటి నృత్య రూపాల‌ను ప్రోత్సహిస్తామన్నారు.  ప‌ర్యాట‌క ప్రాంతాలు,  షాపింగ్ మాల్స్ లో ప్లాష్ మాబ్స్ నిర్వహిస్తామన్నారు.    ద‌శ‌ర‌థి కృష్ణమాచార్యులు శ‌త‌జ‌యంతి ఉత్సవాలు, కాళోజీ నారాయ‌ణ రావు జ‌యంతి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వహిస్తామని మంత్రి జూపల్లి ప్రకటించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Prabhas Marriage: వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
Golconda Bonalu 2024: ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
Jr NTR: ఎన్టీఆర్ షాకింగ్ డెసిషన్... ఒక్క సినిమా తీసిన దర్శకుడికి ఛాన్స్!
ఎన్టీఆర్ షాకింగ్ డెసిషన్... ఒక్క సినిమా తీసిన దర్శకుడికి ఛాన్స్!
Embed widget