అన్వేషించండి

Talasani Srinivas Yadav: రేపు షెడ్యూల్ ఇచ్చి, ఎన్నికలు పెట్టినా మేం సిద్ధం - మంత్రులు తలసాని, కొప్పుల

TS Ministers About Election Schedule : తాము ఎన్నికలకు సిద్ధమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్లు వేరువేరు సమావేశాల్లో వెల్లడించారు.

TS Ministers About Election Schedule :

రాష్ట్రంలో ఎన్నికల వేడి కనిపిస్తోంది. ఇందులో భాగంగా తాము ఎన్నికలకు సిద్ధమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్లు వేరువేరు సమావేశాల్లో వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తీరుపై పలు విమర్శలు చేశారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ....

జమిలి ఎన్నికల పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తాజా సర్వేల్లో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ బీజేపీ గెలిచే అవకాశం లేదన్నారు. ఉన్నట్లుండి వేవ్ ను మార్చితే ఫలితాలు మారుతాయి అని బీజేపీ అనుకుంటోందన్నారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం జరపాలని కోరుతున్నామన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో బిల్లు పెడతారు అనే ప్రచారం ఉందని తలసాని అన్నారు. ఏ ఎన్నికలకు అయినా కేసీఆర్ సర్కార్ సిద్ధంగా ఉందన్నారు. అనంతరం బిజెపి సర్కార్ పై విమర్శలు గుప్పించారు.

రేపు షెడ్యూల్ ఇచ్చి రాష్ట్రంలో ఎన్నికలు పెట్టినా తాము సిద్ధమేనని తలసాని స్పష్టం చేశారు. వన్ ఎలక్షన్ నినాదం మోదీ ఇప్పుడు పెట్టింది కాదన్నారు. మోదీ క్రెజ్ దేశంలో పడిపోయిందన్నారు. బీజేపీ ఓడిపోతుందనే రిపోర్ట్స్ వాళ్లకు ఉందని.. కాబట్టి అసెంబ్లీ- పార్లమెంట్ కలిపి పెడితే వాళ్లకు లాభం జరుగుతుందనే ఆలోచనతో బీజేపీ ఉందన్నారు. జమిలి ఎన్నికలు అని ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికలు జరిపించారన్నారు. జమిలి ఎన్నికలు అంటే దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని తలసాని పేర్కొన్నారు.

ఎన్నికలపై మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.....

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 115 మంది అభ్యర్థులతో మేము విడుదల చేసుకోవడం చేసుకోవడం మా ఎన్నికల సంసిద్ధతకు నిదర్శనం అని వెల్లడించారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయని అన్నారు. జమిలి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమే అని ప్రకటించారు. ఎన్నికలకు ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయని ప్రకటించారు. కేంద్రానికి, బీఆర్ఎస్ మద్దతు అనేది పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలియజేశారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్ పార్టీపై పలు విమర్శలు చేశారు.

బీఆర్ఎస్ పార్టీకి భయపడే కాంగ్రెస్ పార్టీ దళిత డిక్లరేషన్ ప్రకటించిందని ఆరోపించారు. ఎన్నికల ముందు దళితులను, గిరిజనులను మభ్య పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ పెట్టేందుకు ప్రయత్నిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మేందుకు దళితులు, గిరిజనులు అమాయకులు కాదన్నారు. మల్లికార్జున ఖర్గే ఈ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ విడుదల చేయాల్సింది తెలంగాణలో కాదని... కాంగ్రెస్ పాలిత ప్రాంత రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ఎవరు నమ్మేలా లేదని చెప్పారు. ఇన్నేళ్లు ఈ పథకాలు అమలు చేయాలని కాంగ్రెస్ కు ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తమ పథకాలనే కాంగ్రెస్ పార్టీ కాపీ కొడుతుందన్నారు. " తెలంగాణలో మళ్లీ మేమే వస్తాం. మరింత సమర్థవంతంగా పథకాలు అమలు చేస్తాం" అని మంత్రి కొప్పుల ఈశ్వర్ దీమా వ్యక్తం చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Embed widget