Telangana Teacher Promotions: తెలంగాణలో ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్- ప్రమోషన్స్ ఫైల్ రెడీ
Telangana Teachers: పదిహేళ్లుగా తెలంగాణ ఉపాధ్యాయుల ఎదురు చూపులు ఫలించాయి. ప్రమోషన్స్‌కు ప్రభుత్వం ఓకే చెప్పింది. త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. ముందుగా మల్టీ జోన్ వన్‌లో ప్రక్రియ చేపట్టనుంది.
Telangana News: తెలంగాణలో ఉపాధ్యాయులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. 15 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్స్ ఫైల్ సిద్ధమైంది. ఆమోదించిన తర్వాత దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఏ క్షణంలోనైనా వెలువడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ముందుగా మల్టీజోన్ వన్ పరిధిలో ప్రమోషన్లు క్లియర్ చేయనున్నారు. వరంగల్ పరిధిలోని దాదాపు 10 వేల మంది ఉపాధ్యాయులకు ముందు గుడ్ న్యూస్ రానుంది. తర్వాత హైదరాబాద్ పరిధిలోని ఉపాధ్యాయులకు స్వీట్ చెప్పనుంది ప్రభుత్వం.
మల్టీజోన్ వన్ పరిధిలో 19 జిల్లాలు ఉన్నాయి. అక్కడ పదివేల మందికిపై ఉపాధ్యాయులు పదోన్నతి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ జీవో వస్తే దాదాపు 4900 మంది లాంగ్వేజ్ పండిట్లు, 900 మంది పీఈటీలకు ప్రమోషన లభించనుంది.
ఇప్పుడు ఉన్న లాంగ్వేజ్ పండిట్లు స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్లుగా, పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లుగా, ఎస్జీలు, స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందుతారు. ఈ ప్రమోషన్ లిస్టులో ఎక్కువ మంది లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీలే ఉన్నారు.
మల్టీ జోన్ వన్ పరిధిలో దాదాపు ఐదు వేల మంది లాంగ్వేజ్ పండిట్లు, వెయ్యి మంది పీఈటీలు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది నిజామాబాద్ జిల్లా, ఖమ్మంలో జిల్లాలో ఉన్నారు. ప్రమోషన లభించిన ఉపాధ్యాయుడికి రెండు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. మొదటి జోన్ ప్రమోషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత రెండో మల్టీ జోన్ పరిధి ప్రమోషన్ ఉత్తర్వులు రానున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న రెండో మల్టీజోన్‌లో 14 జిల్లాల ఉపాధ్యాయులు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు.