అన్వేషించండి

Medaram Jatara: మేడారం ఎలా వెళ్లాలి..? ఏయే మార్గాల్లో చేరుకోవచ్చు..? ఇవిగో వివరాలు

Medaram News: కోటిమందికి పైగా తరలివచ్చే మేడారం జాతరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తరలివెళ్లిరావడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇవిగో ఆ వివరాలు...

Medaram News: మేడారం (Medaram) మహాజాతరలో అసలు సిసలైన ఘట్టం మొదలైంది. ఇన్నిరోజులుగా  ముందస్తుగా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటుండగా...నేటి నుంచి మొదలు కానున్న మహా జాతరకు దాదాపు కోటి మంది భక్తులు వస్తారని అంచనా. వనజాతరకు దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా  తెలంగాణ(Telangana) ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి ప్రారంభంకానున్న  మహా జాతర ఈనెల 24 వరకు నాలుగురోజుల పాటు సాగనుంది. మాఘశుద్ధ పౌర్ణమి శనివారంతో మహా జాతర ముగియనుంది. 
పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులకోసం రాష్ట్ర ప్రభుత్వం ముందునుంచే అవగాహన కల్పిస్తోంది. మేడారం(Medaram) చేరుకోవడానికి ఏయే దారులు ఉంటాయి. ఎక్కడెక్కడ పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ఎటువైపు నుంచి వస్తే ఇబ్బందులు తలెత్తకుండా అమ్మవార్లను దర్శించుకుని క్షేమంగా ఇంటికి చేరుకుంటారన్న దానిపై ప్రభుత్వం ముందునుంచీ  ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా  మేడారం చేరుకునేందుకు  ప్రధానమైన ఐదు రహదారులు ఉన్నాయి.

Also Read: అడవి తల్లుల దీవెనెకు ప్రతిరూపం - భక్తజన వనసంబురం మేడారం గురించి ఈ విషయాలు తెలుసా!


ఇవీ మార్గాలు
*మహారాష్ట్ర( Maharashtra), ఉమ్మడి  కరీంనగర్(Karimnagar), ఆదిలాబాద్(Adilabad), నిజామాబాద్(Nizamabad) నుంచి వచ్చే వాళ్లు...కాటారం  మీదుగా  మేడారం చేరుకోవచ్చు. అదే మార్గంలో తిరిగి వెళ్లొచ్చు. కాల్వపల్లి వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించారు. 

* ఖమ్మం(Khammam), ఆంధ్రప్రదేశ్(AP), ఛత్తీస్ ఘడ్(Chhattisgarh) , ఒడిశా(Odisha) నుంచి వచ్చే భక్తులు చిన్న బోయినపల్లి మార్గంలో రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేశారు. ప్రైవేట్ వాహనాల్లో వచ్చే ఈ భక్తుల కోసం ఊరగట్టు వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించారు. 
*భూపాల్లి మీదుగా మేడారం వచ్చే వారి కోసం భూపాలపల్లి -మేడారం రహదారి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

* వరంగల్(Warangal), హైదరాబాద్(HYD), మహబూబ్ నగర్(Mahabubnagar), నల్గొండ (Nalgonda)నుంచి వచ్చే భక్తులు పస్రా మీదుగా మేడారం చేరుకోవాలి. ఈ మార్గం కేవలం ప్రైవేట్ వాహనాలు రాకపోకలు సాగించేందుకు మాత్రమే ఉంది. తిరుగు ప్రయాణంలో మాత్రం భూపాలపల్లె మీదుగా  తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. 

* రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు మాత్రం తాడ్వాయి మీదుగా మేడారం చేరుకుంటాయి. ఈ మార్గంలో కేవలం ఆర్టీసీ బస్సుల రాకపోకలకు మాత్రమే అనుమతిస్తున్నారు. అలాగే వరంగల్, హైదరాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం సహా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వీవీవీఐపీలకు ఈ మార్గంలో అమ్మవారి దర్శనానికి  వెళ్లే ఏర్పాట్లు చేశారు.

Also Read: నిరాడంబరంగా ఉండే సమ్మక్క సారలమ్మ ల గద్దెలు కాలక్రమేణా ఇలా మారాయ్!


మేడారం లెక్కలు
భక్తుల సౌకర్యార్థం మొత్తం 40 ప్రాంతాల్లో 1400 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. మేడారం జాతరకు దాదాపు 10 లక్షలకు పైగా వాహనాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే అప్పటికప్పుడు ప్రాథమిక చికిత్స అందించేందుకు గద్దెల సమీపంలోని టీటీడీ కల్యాణమండపంలో 50 పడకల ఆస్పత్రిని సిద్ధం చేశారు. జాతర జరిగే ప్రాంతంలో 42 వైద్య శిబిరాలు, 150 మంది వైద్యులు, 1500 మంది వైద్య సిబ్బందిని మోహరించారు. జాతర పరిసరాల్లో భక్తుల సౌకర్యార్థం 5,730 తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించారు. 5వేల నల్లాలు, 200 చేతిపంపులు ఏర్పాటు చేశారు. 2కమాండ్ కంట్రోలు రూంలు ఏర్పాటు చేసి ...సీసీ కెమెరాలతో పటిష్టమైన నిఘా ఉంచారు. జాతర కోసం 14 వేలమంది పోలీసు సిబ్బంది,4 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు.

Also Read: నాలుగు రోజుల జాతరలో ఏ రోజు ఏం చేస్తారు - మూడోరోజు ఎందుకు ప్రత్యేకం!

Also Read: మేడారంలో హెలికాప్టర్ సేవలు రెడీ, రెండు రకాల ప్యాకేజ్‌లు - ఇలా బుక్ చేసుకోవచ్చు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget