అన్వేషించండి

Medaram Sammakka Saralamma Jatara 2024: అడవి తల్లుల దీవెనెకు ప్రతిరూపం - భక్తజన వనసంబురం మేడారం గురించి ఈ విషయాలు తెలుసా!

Medaram Jatara 2024: దట్టమైన అడవిలో దాగిన ఓ చారిత్రక నమ్మకం, అడవి తల్లుల దీవెనెకు ప్రతిరూపం, వనదేవతల అడుగుజాడలకు ఉప్పొంగే ప్రవాహం, కోటి గొంతుకలకు నాలుగు రోజుల సంబురం మేడారం జాతర...

Medaram Sammakka Saralamma Jatara 2024: ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకూ నాలుగు రోజుల పాటూ మేడారం జాతర

కనుచూపుమేరలో నేల కనిపించని జనసంద్రం
మరో కుంభమేళాని తలపించే మహా జాతర
రెండు గద్దెలను దర్శించుకునేందుకు కోట్లాది భక్తులు
ప్రతి ఒక్కరిలోనూ ఒకటే ఆలోచన..అమ్మను చూడాలి..అమ్మకు మొక్కాలి.. మొక్కులు చెల్లించాలి
రాజులు  పోయినా రాజ్యాలు పోయినా నాటి నుంచి నేటి వరకూ సమ్మక్క సారలమ్మలు వనదేవతలై పూజలందుకుంటున్నారు. 

Also Read: ఈ ఏకాదశి నుంచి ఈ 5 రాశులవారికి అదృష్టం మొదలవుతుంది

వీర వనితల తెగువకు తలవంచి చేసే ప్రణామం

మేడారంలో ఉన్న రెండు గద్దెలకు ఉన్న మహత్యం చెప్పడానికి మాటలు సరిపోవు. జాతర సందర్భంగా అమ్మల ఆగమనం మొదలు తిరిగి వనప్రవేశం వరకూ ఆ వైభవం వర్ణించేందుకు మాటలు సరిపోవు. మరో కుంభమేళాని తలపించే అతిపెద్ద జాతర ఇది. 13వ శతాబ్దాంలో కాకతీయ ప్రభువు ప్రతాప రుద్రుడి ప్రతాపానికి ఎదురొడ్డి నిలిచిన వీరవనితలు సమ్మక్క సారక్కలు. ఆ మగువల తెగువను మనసారా తలుచుకోవడానికి ఆతల్లుల త్యాగనిరతికి తలవంచి ప్రణామాలు చేయడానికే ఈ జాతర. ఈ జాతరకు సంబంధించి ఇంకా చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఆదివాసీలు ఈ కథను ప్రామాణికంగా తీసుకుని ఈ జాతరని జరుపుకుంటారు.  

Also Read: జయ ఏకాదశి - ఈ రోజు ఇలాచేస్తే భోగభాగ్యాలు కలుగుతాయి!

మేడారానికి సంబంధించి ప్రచారంలో ఉన్న గాథ

మేడారం సామ్రాజ్యాన్ని కాకతీయుల సామంతుడు పగిడిద్ధ రాజు పాలించేవాడు. ఆయన సతీమణి సమ్మక్క. ఆ దంపతులకు ముగ్గురు సంతానం. సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. ప్రస్తుత కరీంనగర్ జిల్లాలోని ఎలగందులను పాలించిన మేడరాజుకు పగిడిద్ద మేనల్లుడు. సామంతులైన కోయలు ఏటా కాకతీయులకు కప్పం చెల్లించాలి. అయితే ఆసంవత్సరం మేడారంలో  పచ్చగడ్డి కూడా మొలవలేదు.  ఈ దుర్బర పరిస్థితిలో కోయలు కప్పమెలా కట్టాలని బాధపడుతూ పగిడిద్దరాజు కాకతీయ చక్రవర్తికి పరిస్థితి వివరించాడు. అయినప్పటికీ కప్పం కట్టాల్సిందేనని లేకుంటే యుద్ధానికి సిద్ధం కావాలని గడువు విధించాడు. గడువు దాటి పోవడంతో కాకతీయ సేన మేడారం పైకి దండెత్తింది. స్వయం పాలన కోసం జరిగిన ఈ పోరు పగిడిద్దరాజు నేత్రుత్వంలో సారలమ్మ, నాగులమ్మ, అల్లుడు గోవిందరాజులు ప్రతాప రుద్రుడి సైన్యాన్ని సంపెంగ వాగు వద్ద నిలువరించారు. 

Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే

అహంకారానికి  - అభిమానానికి జరిగిన పోరాటం

పాలకుల అహంకారానికి, గిరిజనుల ఆత్మాభిమానానికి భీకరమైన పోరాటం జరిగింది. పగిడిద్దరాజు ప్రాణాలు కోల్పోయాడు, నాగులమ్మ నేల కూలింది. సారలమ్మ వీరమరణం పొందింది. గోవిందరాజులు తలవాల్చాడు. ఘోరాన్ని చూడలేక జంపన్న సంపెంగ వాగులోకి దూకాడు. దీంతో సంపెంగ వాగు జంపన్న వాగుగా మారింది. తన వారి మరణవార్త విన్న సమ్మక్క భగ భగ మండి పోయింది. కాకతీయ సేనపై దండెత్తింది. సమ్మక్కను కాకతీయ సేన వెనుక నుంచి పొడిచి దొంగ దెబ్బతీశారు. నెత్తురోడిన సమ్మక్క మేడారానికి ఈశాన్యం వైపున ఉన్న చిలుకల గుట్టపైకి వెళ్లి అదృశ్యమైంది.  కోయలు గుట్ట ప్రాంతమంతా వెతక్కా  ఓ కుంకుమ భరిణె దొరికింది. ఆ స్థలమే వీరభోజ్యమని చెబుతూ రెండు గద్దెలు కట్టించి రెండేళ్లకోసారి ఉత్సవాలు జరపాలన్న అదృశ్యవాణి మాటలతో ప్రతాప రుద్రునిలో మార్పు వచ్చింది.

అప్పటి నుంచి రెండేళ్లకోసారి  సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతోంది....

అయితే  మరికొందరు గిరిజనులు...కాకతీయులతో పోరాటం చేసినట్టు ఎక్కడ ఆధారాలు లేవని తమ పూర్వీకులు సైతం తమకు చెప్పలేదంటున్నారు.    తెగలోని చందా వంశస్థుల ఆడబిడ్డ సమ్మక్క అని చెబుతారు. అయితే సమ్మక్క పగిడిద్దరాజుల కుటుంబం కాకతీయులతో పోరాటం చేసి వీర మరణం పొందారు అనడానికి చరిత్రలో ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఆదివాసి కోయిల తో పాటు గిరిజనేతర్ల నమ్మకానికి విశ్వాసానికి ...కోట్లాది భక్తుల విశ్వాసానికి  సమ్మక్క సారలమ్మ జాతర ఒక వేదికగా మారింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Kakinada Pawan Kalyan: కాంప్రమైజ్ అయిపోయారా - రైస్ స్మగ్లింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం - కాకినాడ పోర్టులో తనిఖీలు
కాంప్రమైజ్ అయిపోయారా - రైస్ స్మగ్లింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం - కాకినాడ పోర్టులో తనిఖీలు
Lagacharla Land Acquisition:: లగచర్ల భూసేకరణ రద్దు- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 
లగచర్ల భూసేకరణ రద్దు- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మురళి కృష్ణుడి అలంకారంలో  శ్రీప‌ద్మావ‌తి అమ్మవారునర్సుపై కొడవలితో దాడి, లవర్ పనే..! సీసీటీవీ వీడియోఊరి మీద విరుచుకుపడి ప్రాణాలు తీసేసిన పెద్దపులిISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Kakinada Pawan Kalyan: కాంప్రమైజ్ అయిపోయారా - రైస్ స్మగ్లింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం - కాకినాడ పోర్టులో తనిఖీలు
కాంప్రమైజ్ అయిపోయారా - రైస్ స్మగ్లింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం - కాకినాడ పోర్టులో తనిఖీలు
Lagacharla Land Acquisition:: లగచర్ల భూసేకరణ రద్దు- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 
లగచర్ల భూసేకరణ రద్దు- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Tiger Attack Komaram Bheem Asifabad District News: కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
Crime News: బాలున్ని కట్టేసి గొంతు కోసి చంపేశారు - మేనమామే కాలయముడు, సత్యసాయి జిల్లాలో ఘోరం
బాలున్ని కట్టేసి గొంతు కోసి చంపేశారు - మేనమామే కాలయముడు, సత్యసాయి జిల్లాలో ఘోరం
Dragon Movie - NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడో తెలుసా?
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడో తెలుసా?
Amazon Black Friday Sale 2024: ఇండియాలో అమెజాన్ మొట్టమొదటి బ్లాక్ ఫ్రైడే సేల్ - స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు!
ఇండియాలో అమెజాన్ మొట్టమొదటి బ్లాక్ ఫ్రైడే సేల్ - స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు!
Embed widget