అన్వేషించండి

Mancherial: వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే, అలా బెదిరించారట.. సొంత పార్టీ మహిళ ఫిర్యాదు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వల్ల తనకు ప్రాణ హాని ఉందని ఓ మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై అదే పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశం అయింది. తనతో పాటు తన కుమారుడిని కూడా చంపుతానని ఎమ్మెల్యే బెదిరించినట్లుగా ఓ మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సొంత పార్టీ అయిన తననే ఎమ్మెల్యే ఇబ్బందులకు గురి చేస్తున్నారని మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను అసభ్యంగా కూడా దూషించినట్లుగా పేర్కొన్నారు. ఇలా సొంత పార్టీ మహిళా నేత తమ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.

అసలేం జరిగిందంటే..
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వల్ల తనకు ప్రాణ హాని ఉందని ఓ మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై అమెరికాలో ఉండే తన కొడుకు.. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారని, ఇది మనసులో పెట్టుకున్న ఎమ్మెల్యే తననూ, తన కొడుకునూ చంపుతానని ఫోన్లో బెదిరిస్తున్నాడని పద్మా రెడ్డి అనే స్థానిక టీఆర్ఎస్ మహిళా నేత ఆరోపించారు. గతంలో కూడా మూడు సార్లు ఇదే విధంగా ఎమ్మెల్యేతో పాటు అనుచరులు బెదిరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నుంచి తనకు, తన కుమారుడికి ప్రాణ హాని ఉందని వాపోయారు. ఎమ్మెల్యే తనకు ఫోన్ చేసి బూతులు తిట్టాడని ఆమె ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఏసీపీకి ఫిర్యాదు చేశారు.

Also Read: Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ అలర్ట్... రాగల రెండు రోజులు పలు జిల్లాల్లో భారీ వర్షాలు... హైదరాబాద్ మరో నాలుగు రోజులపాటు వర్షాలు

Also Read: Bandi Sanjay: కొవిడ్ సాకుతో ఉప ఎన్నికల వాయిదా వేయిస్తవా.. మరి స్కూళ్లెందుకు తెరిపించినవ్.. బండి సంజయ్ నిలదీత

అయితే, ఎమ్మెల్యేపై ఇప్పటికే పలు భూ వివాదాలు ఉన్నాయి. అంతేకాకుండా కౌన్సిలర్ కుమార్తెను కూడా బెదిరించినట్లు గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో వివాదంలో చిక్కుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, స్థానిక విపక్ష నేతలు మాత్రం మహిళకు మద్దతు ఇస్తున్నారు. ఎమ్మెల్యే సొంత పార్టీ నేతలపైనే ఇలా దురుసుగా ప్రవర్తిస్తే, ఇతరులను ప్రజలను ఎలా చూస్తారని వారు నిలదీస్తున్నారు.

Also Read: Huzurabad News: కేసీఆర్‌కు ఆ ప్రాజెక్టు ATM లాంటిది.. ఆయన ఇంట్లోనే వ్యతిరేకులు, త్వరలోనే.. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు

Also Read: Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సమయాల్లో మార్పులు.. చివరి ట్రైన్ టైం ఇంకా పొడిగింపు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget