Top 5 Headlines Today: నెల్లూరులో ఎమ్మెల్యే అనిల్ ఒంటరి అవుతున్నారా? - తెలంగాణ బీజేపీలో చేరికలు అందుకే లేవా ?
Top 5 Telugu Headlines Today 21st May 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
నెల్లూరులో ఎమ్మెల్యే అనిల్ ఒంటరి అవుతున్నారా? వారితో విభేదాల వల్లే!
నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మధ్య మాటల తూటాలు పేలడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఒకరి బలహీనతలు ఇంకొకరు బయటపెట్టుకునేవరకు వెళ్లింది వ్యవహారం. నీ సంగతి తేలుస్తానంటే, నీ చర్మం ఒలిచేస్తానంటూ సవాళ్లు విసురుకున్నారు. ఆధిపత్య పోరుని రోడ్డున పడేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో అనిల్ కి తొలిదఫా మంత్రి పదవి రావడం స్థానిక నాయకుల్లో కొంతమందికి ఇష్టం లేదనేది బహిరంగ రహస్యమే. కానీ బీసీ కోటాలో అనిల్ కి తొలిదఫా మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించారు సీఎం జగన్. రెండో దఫా ఆయనకు మంత్రి పదవి పోయింది. ఆ స్థానం కాకాణి గోవర్దన రెడ్డికి దక్కింది. దీంతో నెల్లూరులో రాజకీయం మారింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
కవితను ఈడీ అరెస్ట్ చేయకపోడవమే మైనస్సా ? బీజేపీలో చేరికలు అందుకే లేవా ?
బీజేపీ, బీఆర్ఎస్ డిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్లుగా ఉన్నాయని.. కవితను అరెస్ట్ చేయకపోవడం వల్లే బీజేపీ దూకుడు తగ్గిందని .. బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను అరెస్ట్ చేయడమే మిగిలింది అనుకున్న సమయంలో మొత్తం ఒక్క సారిగా చల్లబడిపోయింది. అదే సమయంలో బీజేపీలో చేరికలు కూడా ఆగిపోయాయి. మరో వైపు కర్ణాటక ఎన్నికల్లో కేసీఆర్ ఏ మాత్రం జోక్యం చేసుకోలేదు. మహారాష్ట్రలో మాత్రం అదీ కూడా శివారు ప్రాంతాల్లో ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇదంతా బీజేపీకి మేలు చేయడానికేనన్న ప్రచారమూ ప్రారంభమైంది. ఇదంతా బీజేపీలో చేరికలు తగ్గిపోవడానికి.. ప్రజల్లో బీఆర్ఎస్,బీజేపీ ఒకటే అన్న అభిప్రాయాన్ని కల్పించడానికి కారణం అవుతున్నాయన్న ఆవేదన బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా బీజేపీలో చేరిన నేతల్లో అసంతృప్తి క్రమంగా బయటపడుతోంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు, ప్రారంభించిన తోట చంద్రశేఖర్
జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ కార్యకలాపాలను విస్తరించేందుకు బీఆర్‌ఎస్ పార్టీ మరో ముందడుగు వేసినట్లు అయింది. గుంటూరులో బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రారంభించారు. ప్రారంభం తర్వాత పార్టీ జెండాను ఎగరవేశారు. గుంటూరులో మంగళగిరి రోడ్డులోని ఏఎస్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఐదు అంతస్థుల భవనంలో ఈ ఆఫీసును ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
ఆయనది మానవ జన్మా, రాక్షస జన్మా? ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు
‘చంద్రబాబు నాయుడు మానవ జన్మ ఎత్తాడా లేక రాక్షస జన్మ ఎత్తాడా అనేది తనకు అర్ధం కావడం లేద’ని ఏపి డెప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల దర్శనానికి వచ్చిన ఆయన దేవుడి సన్నిధిలో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆదివారం (మే 21) ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి నైవేద్య విరామ సమయంలో నారాయణ స్వామి, ఏపి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానేంద్రనాధ్ రాయి, పాండిచ్చేరి డెప్యూటీ స్పీకర్ రాజువేలు లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
రేపు మచిలీపట్నంలో సీఎం జగన్ పర్యటన
మే 22వ తేదీ అంటే సోమవారం రోజు ఏపీ జగన్ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించబోతున్నారు. ముఖ్ంగా బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి బందరు మండల పరిధిలోని తపసిపూడి గ్రామం చేరుకుంటారు. అక్కడి నుంచి పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమి పూజ, అనంతరం పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి జిల్లా పరిషత్ సెంటర్‌లోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభ అనంతరం మచిలీపట్నం నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి