(Source: Poll of Polls)
Narayana Swamy: ఆయనది మానవ జన్మా, రాక్షస జన్మా? ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు
ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి నైవేద్య విరామ సమయంలో నారాయణ స్వామి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
‘చంద్రబాబు నాయుడు మానవ జన్మ ఎత్తాడా లేక రాక్షస జన్మ ఎత్తాడా అనేది తనకు అర్ధం కావడం లేద’ని ఏపి డెప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల దర్శనానికి వచ్చిన ఆయన దేవుడి సన్నిధిలో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆదివారం (మే 21) ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి నైవేద్య విరామ సమయంలో నారాయణ స్వామి, ఏపి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానేంద్రనాధ్ రాయి, పాండిచ్చేరి డెప్యూటీ స్పీకర్ రాజువేలు లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎవరికి భయపడి ముందస్తు ఎన్నికలకు వెళాల్సిన అవసరం గానీ, కర్మ జగన్మోహన్ రెడ్డికి పట్టలేదని, అపోహాలు నమ్మొద్దని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.. తాను, చంద్రబాబు ఇద్దరం ఒకే వయస్సు కలవారమని, వయస్సు పెరిగే కొద్ది స్మశానంలో స్ధలం దక్కుతుందో లేదో అనే ఆలోచన వస్తుందని అన్నారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడుకి ఆ ఆలోచన వచ్చిందని అన్నారు.. పేదరికంలో పుట్టిన చంద్రబాబు పేదరికంను మరిచి ప్రవర్తిస్తున్నారని, పేదలకు ఇంటి స్ధలాలు ఇస్తున్న జగన్ ను చూసి చంద్రబాబు ఓర్చుకోలేక, కడుపు మంటతో విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.. ః
చంద్రబాబును బూడ్చేందుకు కూడా ఆరు అడుగుల భూమి కావాల్సిందేనని, పేదవాడు లేక పోతే చంద్రబాబు ఇల్లు కూడా కట్టలేడని, అమరావతిలో పేదవాడు ఉండకూడదని, రాకూడదని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు మానవ జన్మ ఎత్తాడా, రాక్షస జన్మ ఎత్తాడా అర్ధం కాలేదని అన్నారు.. చంద్రబాబులో పదవి వ్యామోహం, దుర్మార్గం తప్ప వేరే ఆలోచన లేదన్నారు.. వెన్నుపోటు దారులతో వెన్నుపోటు దారులే ఉంటారని, చరిత్రలో ఎప్పుడూ చంద్రబాబు పేదలకు ఇళ్ల స్ధలం ఇచ్చి, ఇళ్ళు కట్టి ఇచ్చింది లేదని ఆయన విమర్శించారు.
చంద్రబాబు పుట్టుక, పెరగడం, చావు అబద్ధంమని, చంద్రబాబు, రామోజీ రావు అక్రమాలను జగన్ బయటకు తీస్తున్నారని, పచ్చ మీడియా అనవసరంగా జగన్ పై బురద జల్లె ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.. చంద్రబాబు మ్యానిఫెస్టులో చెప్పింది ఎప్పుడూ చేసింది లేదని, రామారావుకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు. ప్రతి ఒక్కరికి నవరత్నాలు పడ్డాయని, ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారని ఏపి డెప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు.
శ్రీవారి సేవలో ఎంపీ ఆర్.కృష్ణయ్య..
అవినీతితో రాజకీయ నాయకులు కోట్లకు పడగ ఎత్తుతున్నారని, పేదలకు న్యాయం జరగాలంటే, అవినీతి నిర్మూలన జరగాలని రాజ్యసభ ఎంపీ కృష్ణయ్య అన్నారు. ఆదివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఆర్.కృష్ణయ్య స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దేశంలో 56 శాతం జనాభా కలిగిన బిసీలకు నేటికీ అన్యాయం జరుగుతుందని, విద్యా, ఆర్ధిక, వైద్య, రాజకీయ రంగాల్లో బీసీలు వెనక్కపడి పోయారని అన్నారు.. బీసీలకు 56 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, స్ధానిక సంస్ధల రిజర్వేషన్ లోనూ అనేక రకాల అడ్డంకులు ఉన్నాయన్నారు.. మోదీకి బీసీల విషయంలో మంచి బుద్ది కలగాలని స్వామి వారిని ప్రార్ధించాన్ననారు.. త్వరలోనే పేద కులాల నుండి దేశ వ్యాప్తంగా ఉద్యమం రానున్నదని కృష్ణయ్య చెప్పారు.