The Girlfriend Collection Day 2: గర్ల్ ఫ్రెండ్ కలెక్షన్స్... రెండో రోజు రష్మిక డబుల్ ధమాకా - 2 డేస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
The Girlfriend Day 2 Collection: 'గర్ల్ ఫ్రెండ్'కు థియేటర్లలో మంచి స్పందన లభిస్తోంది. మొదటి రోజుతో కంపేర్ చేస్తే రెండో రోజు డబుల్ అమౌంట్ కలెక్ట్ చేసింది. ఈ మూవీ రెండు రోజుల కలెక్షన్ ఎంతో తెలుసా?

బాక్స్ ఆఫీస్ బరిలో 'ది గర్ల్ ఫ్రెండ్' దుమ్ము దులుపుతోంది. నేషనల్ క్రష్ రష్మికా మందన్నా సినిమాకు ప్రేక్షకుల నుంచి మరీ ముఖ్యంగా ఈ తరం అమ్మాయిలు, మహిళల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమా వసూళ్లు రోజుకు పెరుగుతున్నాయి. మొదటి రోజుతో కంపేర్ చేస్తే రెండో రోజు డబుల్ అమౌంట్ కలెక్ట్ చేసింది. రెండు రోజుల్లో సినిమాకు ఎంత కలెక్షన్స్ వచ్చాయి? అనేది చూస్తే...
రెండో రోజు ఇండియాలో రెండున్నర కోట్లు!
'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాకు మొదటి రోజు ఇండియాలో ఒక కోటి 30 లక్షల రూపాయల నెట్ కలెక్షన్స్ వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రానికి తెలుగులో రూ. 1.23 కోట్లు, హిందీలో ఏడు లక్షలు మొదటి రోజు నెట్ కలెక్షన్. రెండో రోజు తెలుగులో ఆ అమౌంట్ డబల్ అయింది.
'ది గర్ల్ ఫ్రెండ్' తెలుగు వెర్షన్ శనివారం నాడు ఇండియా నుంచి రూ. 2.4 కోట్ల రూపాయల కలెక్ట్ చేసింది. శుక్రవారంతో పోలిస్తే సుమారు 90% పెరిగాయి. అదే సమయంలో హిందీ కలెక్షన్స్ కాస్త తగ్గాయి. అక్కడి నుంచి కేవలం లక్ష రూపాయలు మాత్రమే వచ్చింది. రెండు రోజుల్లో 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాకు మూడు కోట్ల 80 లక్షల రూపాయల కలెక్షన్ వచ్చింది. ఒక ప్రేమ కథకు, అందులోనూ సున్నితమైన అంశాన్ని డిస్కస్ చేసిన సినిమాకు ఈ స్థాయిలో వసూళ్ల రావడం గ్రేట్.
Also Read: 'గేమ్ ఛేంజర్' ఫ్లాప్ మర్చిపోయేలా చేసిన చికిరి చికిరి
మహిళల నుంచి అద్భుతమైన ఆదరణ!
'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాకు మహిళల నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. థియేటర్ల నుంచి బయటకు వచ్చే అమ్మాయిల కళ్ళల్లో తడి కనబడుతోంది. ఒక మహిళ గురించి రాహుల్ రవీంద్రన్ ఇంత అద్భుతమైన సినిమా తీస్తారని ఊహించలేదని పలువురు ప్రశంసిస్తున్నారు.
Also Read: 'జటాధర' ఓపెనింగ్ డే కలెక్షన్స్... సుధీర్ బాబు కెరీర్‌లో మరో డిజాస్టర్?
'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాలో రష్మిక టైటిల్ రోల్ చేయగా ఆమె బాయ్ ఫ్రెండ్ పాత్రలో దీక్షిత్ శెట్టి నటించారు దసరా తర్వాత తెలుగులో ఆయన మరొక విజయం అందుకున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి ధీరజ్ మొగిలినేని సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ పాటలు అందించగా ప్రశాంత్ ఆర్ విహారి నేపథ్య సంగీతం సమకూర్చారు.





















