Balakrishna : సింగర్‌గా మారనున్న బాలయ్య - 'NBK111'లో సాంగ్ కన్ఫర్మ్ చేసిన తమన్!
NBK111 Update : గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబోలో హిస్టారికల్ యాక్షన్ డ్రామా 'NBK111' రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఓ సర్ ప్రైజ్ ఉండనున్నట్లు తమన్ అప్డేట్ ఇచ్చారు.

Balakrishna To Sing A Song In NBK111 Movie : గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతోన్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా 'NBK111' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ నుంచే భారీ హైప్ క్రియేట్ చేస్తుండగా... బాలయ్య ఫ్యాన్స్‌కు మరింత కిక్ ఇచ్చేలా మరో న్యూస్ వైరల్ అవుతోంది.
పాట పాడనున్న బాలయ్య!
ఈ మూవీలో ఓ పాటను స్వయంగా బాలయ్యే పాడనున్నారట. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ విషయాన్ని లేటెస్ట్ ఈవెంట్‌లో కన్ఫర్మ్ చేశారు. అంతే కాకుండా ఈ పాట 'బాహుబలి' సినిమాలో దలేర్ మెహందీ పాడిన 'సాహోరే బాహుబలి'లా ఈ సాంగ్ ఉంటుందట. బాలకృష్ణ ఇంతకు ముందు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'పైసా వసూల్' సినిమాలో 'అరె మామా ఏక్ పెగ్‌లా' సాంగ్ పాడారు.
అప్పట్లో ఈ సాంగ్ ట్రెండ్ అయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన పాట పాడుతుండడంతో హైప్ మామూలుగా లేదు. ప్రస్తుతం 'అఖండ 2' సక్సెస్ జోష్‌లో ఉన్న బాలయ్య ఫ్యాన్స్‌కు ఈ న్యూస్ మరింత జోష్ ఇచ్చిందనే చెప్పాలి.
Also Read : న్యూ యాక్టర్స్... యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'పతంగ్' - ఎస్పీ చరణ్ కీ రోల్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
ఇక ఈ మూవీలో బాలయ్య సాంగ్‌తో పాటు తమన్నా స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. బాలయ్య అంటేనే మాస్... మాస్ అంటేనే బాలయ్య. ఫుల్ ఎనర్జీ, జోష్‌తో ఆయన స్టెప్పులకు థియేటర్లలో ఫ్యాన్స్ ఫిదా అవుతారు. మరి ఈ మూవీలో మిల్కీ బ్యూటీతో ఎలాంటి స్టెప్పులు వేస్తారో చూడాల్సి ఉంది. ఇప్పటికే కొత్త షెడ్యూల్‌కు టీం ప్లాన్ చేస్తోంది.
సినిమాలో బాలయ్య సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుండగా... పవర్ ఫుల్ రాణిగా ఆమె లుక్‌ను రీసెంట్‌గా రివీల్ చేశారు. ప్రస్తుతం ఇది ట్రెండ్ అవుతోంది. ఈ మూవీని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ వెంకట కిలారు నిర్మిస్తున్నారు. గతం కంటే డిఫరెంట్‌గా ఈ హిస్టారికల్ డ్రామాను తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు.





















