అన్వేషించండి

Kavitha Arrest Politics : కవితను ఈడీ అరెస్ట్ చేయకపోడవమే మైనస్సా ? బీజేపీలో చేరికలు అందుకే లేవా ?

కవితను అరెస్ట్ చేయకపోవడం వల్లే తెలంగాణలో బీజేపీకి మైనస్‌గా మారిందా ? ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐ ఎందుకు స్లో అయ్యాయి ?

 
Kavitha Arrest Politics :  బీజేపీ, బీఆర్ఎస్ డిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్లుగా ఉన్నాయని.. కవితను అరెస్ట్ చేయకపోవడం వల్లే బీజేపీ దూకుడు తగ్గిందని .. బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను అరెస్ట్ చేయడమే మిగిలింది అనుకున్న సమయంలో మొత్తం ఒక్క సారిగా చల్లబడిపోయింది. అదే సమయంలో బీజేపీలో చేరికలు కూడా ఆగిపోయాయి. మరో వైపు కర్ణాటక ఎన్నికల్లో కేసీఆర్ ఏ మాత్రం జోక్యం చేసుకోలేదు. మహారాష్ట్రలో మాత్రం అదీ కూడా శివారు ప్రాంతాల్లో ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇదంతా బీజేపీకి మేలు చేయడానికేనన్న ప్రచారమూ ప్రారంభమైంది. ఇదంతా బీజేపీలో చేరికలు తగ్గిపోవడానికి.. ప్రజల్లో బీఆర్ఎస్,బీజేపీ ఒకటే అన్న అభిప్రాయాన్ని కల్పించడానికి కారణం అవుతున్నాయన్న ఆవేదన బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా బీజేపీలో చేరిన నేతల్లో అసంతృప్తి క్రమంగా బయటపడుతోంది. 

ఢిల్లీ లిక్కర్ స్కాం ఎందుకు స్లో అయింది ? 

దేశ రాజకీయాలను ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో  ప్రకంపనలు రేపుతుందని భావించిన  ఢిల్లీ లిక్కర్ స్కాంలో కాస్త పాజ్ వచ్చింది. కల్వకుంట్ల కవిత కాలికి గాయం కావడంతో దాదాపుగా నెల రోజులుకపైగా బయట కనిపించలేదు.   ఆమె గాయం నుంచి కోలుకుని కొండగట్టుకు వెళ్లి హనుమాన్ చాలీసా పాటించి మళ్లీ వార్తల్లోకి వచ్చారు.  ఆ తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. గత నెలన్నర  రోజుల్లోనే హవాలా కేసులో జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ కవితకు డబ్బులు ఇచ్చినట్లుగా వాట్సాప్ చాట్స్  బయట పెట్టారు. అలాగే ఈడీ కూడా కవిత ఎంత డబ్బులు ఢిల్లీ లిక్కర్ స్కాం చేసి సంపాదించారో వాడితో ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారో కూడా కోర్టుకు అభియోగపత్రంలో తెలిపింది. ఈ రెండూ అత్యంత కీలకమైన సాక్ష్యాలు అనుకోవచ్చు. కానీ అనూహ్యంగా ఈడీ, సీబీఐలు సైలెంట ్అయిపోయాయి. 
   
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అందరూ అరెస్ట్.. కవిత తప్ప !

సుఖేష్ చంద్రశేఖర్ వాట్సాప్ చాట్‌లను బయట పెట్టినప్పుడు సోషల్ మీడియా ద్వారా స్పందించిన కవిత.. తనపై నిర్దిష్టమైన అభియోగాలు నమోదు చే్తూ ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌పై మాత్రం స్పందించలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితులు అందర్నీ ఈడీ, సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఒకరి తర్వాత ఒకరు కేసులు పెట్టారు. నెలల తరబడి నిందితులు జైల్లో ఉంటున్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్న సిసోడియా పదవి కూడా పోగొట్టుకున్నారు. ఎన్నో సార్లు ఆయన బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురయింది. గత నవంబర్ లో అరెస్ట్ చేసిన ఇద్దరికి రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత అరబిందో శరత్ చంద్రారెడ్డికి ఆయన భార్య అనారోగ్యం కారణంగా బెయిల్ ఇచ్చింది. అదే సమయంలో మాగుంట రాఘవకు బెయిల్ తిరస్కరించారు. కానీ కవితను మాత్రం అరెస్ట్ చేయలేదు. గతంలో ఈడీ కార్యాలయానికి పిలిచి నాలుగు సార్లు ప్రశ్నించారు. ఆమె కు చెందిన పది ఫోన్లను తీసుకున్నారు. తర్వాత మళ్లీ పిలుస్తామని నోటీసులు ఇచ్చారు కానీ పిలువలేదు. అందర్నీ అరెస్ట్ చేసి కవితకు మాత్రమే ఎందుకు మినహాయింపు ఇచ్చారన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ మినహాయింపులో రాజకీయం ఉందన్న భావన అందుకే పెరుగుతోంది. 
 
బీజేపీపై వ్యూహాత్మక దాడి తగ్గించిన కేసీఆర్ !

కారణం ఏదైనా కేసీఆర్ బీజేపీపై దాడిని తగ్గించారు.  అందర్నీ కలుపుకుని బీజేపీని ఓడిస్తానని పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ ప్రకటించారు.ఇప్పుడు ఎవర్నీ కలవడం లేదు. ఒక్క మహారాష్ట్ర శివారు ప్రాంతాలపై మాత్రమే దృష్టి పెట్టారు.  మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ పైనే విమర్శలు గుప్పించారు. ఆయనా బయటకు రావడం లేదు.  టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చక ముందే కేసీఆర్ పలు రాష్ట్రాల్లో పర్యటించారు. దేశ్ కీ నేత ఇమేజ్ కోసం ప్రయత్నించారు. అయితే అనూహ్యంగా పార్టీ ఏర్పాటు తర్వాత మాత్రం సైలెంట్ అయిపోయారు. ఢిల్లీలో భారీ బహిరంగసభ పెట్టాలని అనుకున్నారు. కానీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కూడా సభ పెట్టడం లేదు. తాత్కలిక ఆఫీసు ప్రారంభోత్సవం కోసం కలిసి వచ్చే నేతల్ని పిలిచినా.. ఇప్పుడు మాత్రం పెద్దగా ఎవర్నీ పిలవ  లేదు. ఉదయం వెళ్లి మధ్యాహ్నం ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేశారు. 

ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తు స్లో కావడం.. మరో వైపు బీజేపీ కేసీఆర్ దాడిని తగ్గించడంతో బీజేపీ, బీఆర్ఎస్ రాజీ చేసుకున్నాయా అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇది కేసీఆర్ ను ఓడించాలని బీజేపీలో చేరిన వారికి అసలు నచ్చడం లేదు. అందుకే ఆ పార్టీలో కొత్త సంక్షోభం ప్రారంభమయింది. 

 

టాప్ హెడ్ లైన్స్

PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
Parliament Monsoon Session 2026 Big Bills: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు - తెరవెనుక బిగ్ బిల్స్ వ్యూహం - దేశ రాజకీయాన్ని మార్చబోతున్న కీలక బిల్లులు!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు - తెరవెనుక బిగ్ బిల్స్ వ్యూహం - దేశ రాజకీయాన్ని మార్చబోతున్న కీలక బిల్లులు!
Parliament Seat Redistribution: డీలిమిటేషన్ పజిల్ - యూనిఫాం 50% ఫార్ములా కు దక్షిణాది సై.. నియోజకవర్గాల పునర్విభజనపై మారిన పొలిటికల్ మైండ్‌సెట్!
డీలిమిటేషన్ పజిల్ - యూనిఫాం 50% ఫార్ములా కు దక్షిణాది సై.. నియోజకవర్గాల పునర్విభజనపై మారిన పొలిటికల్ మైండ్‌సెట్!
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
కొత్త రెనాల్ట్ డస్టర్ రోడ్‌ టెస్ట్‌ రివ్యూ - డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, సేఫ్టీ, మైలేజ్‌ పూర్తి సమీక్ష
కొత్త రెనాల్ట్ డస్టర్ రియల్‌ రోడ్ టెస్ట్ - స్టైలిష్ లుక్‌ అదిరింది, కానీ మైలేజ్‌లో నిరాశ!
This Week OTT Movies : ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Varun Tej : చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
Embed widget