అన్వేషించండి
Beer factory at home: ఇంట్లో బీరు తయారీ యూనిట్ ఎలా తెరవాలి, కనీస వ్యయం ఎంత ?
Beer Manufacturing Unit: రూ.2 లక్షలతో చిన్న బీర్ తయారీ పరిశ్రమ ప్రారంభించి మీ యూనిట్ నుంచి లాభాలు పొందవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకోండి.
బీర్ తయారీ యూనిట్
1/6

బీరు తయారు చేయడానికి ముఖ్యమైనవి మంచి నీరు, మాల్ట్, హాఫ్స్, ఈస్ట్. ఈ నాలుగు పదార్థాల సమతుల్యతతో బీరు రుచి వస్తుంది. మీరు ఇంట్లో చిన్న యూనిట్ ఏర్పాటు చేయాలనుకుంటే ఇందుకోసం ప్రాథమిక బ్రూయింగ్ కిట్ మార్కెట్లో సులభంగా లభిస్తుంది. దీంతో 20 నుండి 25 లీటర్ల వరకు బీరు తయారు చేయవచ్చు.
2/6

ఇంట్లో, నివాస పరిసరాల్లో బీర్ తయారీ యూనిట్ ప్రారంభించే ముందు ప్రభుత్వం నుండి లైసెన్స్ తీసుకోవాలి. ప్రతి రాష్ట్రంలో దీనికి నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. సాధారణంగా మీరు ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ నుంచి అనుమతి తీసుకోవాలి. లైసెన్స్ లేకుండా బీరు తయారు చేసినా, విక్రయించినా అది చట్టవిరుద్ధం అవుతుంది. అందువల్ల ముందు పేపర్ వర్క్ డాక్యుమెంటేషన్ ప్రక్రియను పూర్తి చేయడం మొదటి అడుగు.
3/6

ఖర్చు విషయానికి వస్తే ఇంట్లో చిన్న బీర్ యూనిట్ ఏర్పాటు చేయడానికి దాదాపు రూ.1.5 నుంచి 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇందులో పరికరాలు, బ్రూయింగ్ కిట్, ముడి పదార్థాలు, ప్రారంభ సెటప్ మొత్తం ఉంటాయి. మీరు కమర్షియల్ స్థాయిలో ఎదగాలనుకుంటే 10 నుంచి రూ. 15 లక్షల వరకు ఖర్చుతో మొదలుపెట్టాలి.
4/6

బీరు తయారు చేయడంలో భాగంగా మాల్ట్ ను ఉడకబెట్టడం, హాప్స్ కలపడం, ఈస్ట్ వేసి పులియబెట్టడం చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ దాదాపు 10 నుంచి 15 రోజులు పడుతుంది. అందుకు సరైన ఉష్ణోగ్రతతో పాటు శుభ్రత చాలా అవసరం. ఎందుకంటే చిన్న తప్పు కూడా బీర్ క్వాలిటీని దెబ్బతీస్తుంది.
5/6

తయారు చేసిన బీరును నిల్వ చేయడానికి మీకు చల్లని, పొడి ప్రదేశం ఉండాలి. దీని కోసం మినీ కూలర్ లేదా ఫ్రిజర్ సిస్టమ్ ఉపయోగించవచ్చు. బాట్లింగ్ కోసం మార్కెట్లో ఆటోమేటిక్ యంత్రాలు దొరుకుతాయి. దీంతో మీరు దీన్ని రిజిస్టర్డ్ పేరుతో బ్రాండింగ్ చేసి స్థానిక మార్కెట్లో విక్రయించవచ్చు.
6/6

మీరు సరైన మార్కెటింగ్ వ్యూహంతో బీర్ తయారీ యూనిట్ ప్రారంభిస్తే వ్యాపారంలో మంచి లాభాలను చూస్తారు. ప్రస్తుతం యువ కస్టమర్లు స్థానిక క్రాఫ్ట్ బీర్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మీ బీర్ ఒకసారి బాగా ఫేమస్ అయితే రెస్టారెంట్లు, బార్లకు, వైన్స్ షాపులకు సరఫరా చేయడం ద్వారా వ్యాపారాన్ని విస్తరించవచ్చు.
Published at : 09 Nov 2025 10:15 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















