Machilipatnam Bandar Port: రేపు మచిలీపట్నంలో సీఎం జగన్ పర్యటన - బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం
Machilipatnam Bandar Port: సోమవారం రోజు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏపీ సీఎం జగన్ పర్యటించబోతున్నారు. ఈ క్రమంలోనే బందర్ పోర్టు నిర్మాణం పనులను ప్రారంభిస్తారు.
Machilipatnam Bandar Port: మే 22వ తేదీ అంటే సోమవారం రోజు ఏపీ జగన్ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించబోతున్నారు. ముఖ్ంగా బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి బందరు మండల పరిధిలోని తపసిపూడి గ్రామం చేరుకుంటారు. అక్కడి నుంచి పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమి పూజ, అనంతరం పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి జిల్లా పరిషత్ సెంటర్‌లోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభ అనంతరం మచిలీపట్నం నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
పోర్ట్ నిర్మాణం జరిగితే దశాబ్దాలుగా కలలు కంటున్న స్దానికుల కల తీరుతుంది. కేంద్రం సహకారంతో అన్ని రకాల అనుమతులు తీసుకువచ్చి, నిర్మాణ పనులకు శంఖుస్దాపన కాకుండా, పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎంపీ బాలశౌరి చెబుతున్నారు. బందరు పోర్ట్ నిర్మాణం విషయంలో స్దానిక శాసన సభ్యుడు పేర్నినాని, పార్లమెంట్ సభ్యుడు బాలశౌరి మధ్య విభేదాలు ఇప్పటికే బహిర్గతం అయ్యాయి. ఈ కారణంతోనే బందరు పోర్ట్ పనుల ను నేరుగా ప్రారంభించేందుకు రావాల్సిన ముఖ్యమంత్రి షెడ్యూల్ కూడ వాయిదా పడిందనే ప్రచారం జరిగింది. అయితే ఇటీవలే శాసన సభ్యుడు పేర్ని నాని పోర్ట్ పనులను ప్రారంభించేందుకు అవసరం అయిన మౌలిక సదుపాయాలు పై ఆరా తీశారు.
స్దానికంగా పర్యటించి, వాహనాల రాకపోకలు, ముడి సరుకు రవాణాకు అవసరం అయిన మార్గాల ఏర్పాటు పై అధికారులతో చర్చించారు. దీంతో పోర్ట్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఉగాది తరువాత ముఖ్యమంత్రి జగన్ పర్యటన ఖరారు అవుతుందని చెబుతున్నారు. బందరు పోర్టు నిర్మాణానికి 5,253.88 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇందులో 75 శాతం బ్యాంకు రుణం, 25 శాతం ప్రభుత్వం సొంతంగా ఖర్చు చేయాలని గతంలోనే అంచనాకు వచ్చారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 75 శాతం రుణం ఇచ్చేందుకు కూడ ఆమోదం లభించింది. దీంతో క్యాబినేట్ సమావేశంలో రుణం తీసుకునే అంశం పై చర్చించారు. రుణం పొందేందుకు క్యాబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సముద్ర కెరటాలను అడ్డుకోవడానికి 2 కిలోమీటర్ల 325 మీటర్ల దక్షిణం, ఉత్తరం బ్రేక్స్ వాటర్ గోడల నిర్మాణాలకు రూ.446 కోట్లు అవసరం అవుతాయని ఇప్పటికే అంచనాలు కూడ రూపొందించారు. ఉత్తరం వైపున 250 మీటర్ల కొండరాళ్లతో కాంక్రీట్ గోడ నిర్మాణానికి రూ. 10. 94 కోట్లు, అలాగే దక్షిణం వైపున సడన్ బ్రేక్ వాటర్ రూ. 435 కోట్ల రూపాయలు వ్యయం అవుతుంది. డ్రెడ్జింగ్ కోసం మరో రూ.1242.88 కోట్లు, సముద్రం నుంచి ఓడలు రావడానికి అప్రోచ్ ఛానెల్ నిర్మాణానికి రూ. 706.26 కోట్లు, బ్రేక్ వాటర్ మధ్యలో ఓడలు తిరగడానికి టర్నింగ్ సర్కిల్, బెర్త్ పాకెట్స్ కోసం రూ.452.07 కోట్లు ఖర్చు అవుతుందని డీపీఆర్ రెడీ చేశారు.