By: ABP Desam | Updated at : 07 Feb 2023 08:44 PM (IST)
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు
MLAs Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు పై సుప్రీంను ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం. కేసును సీబీఐకి అప్పగించాలన్న హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసింది. వెంటనే విచారణకు తీసుకోవాలంటూ సిజెఐ చంద్రచూడ్ ధర్మాసనాన్ని కోరిన సీనియర్ కౌన్సిల్ దుష్యంత్ దవే ప్రధాన న్యాయమూర్తిని కోరారు. సిబిఐ విచారణ ప్రారంభిస్తే సాక్ష్యాలన్నీ ధ్వంసమవుతాయని ఆందోళన వెలిబుచ్చారు. బుధవారం ధర్మాసనం దృష్టికి తీసుకురావాలని దుష్యంత్ దవేను సీజేఐ కోరారు. ధర్మాసనం దృష్టికి తీసుకొస్తే వచ్చే వారం విచారణకు అనుమతి ఇస్తామన్న సిజెఐ చంద్రచూడ్ తెలిపారు. బుధవారం మెన్షన్ చేయకపోయినా వచ్చే వారం విచారణకు వస్తుందని తెలిపారు.
అంతకు ముందు తాము సుప్రీంకోర్టును ఆశ్రయించేవరకూ తీర్పును సస్పెండ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం గతంలో ఈ అంశంపై విచారణకు సీజే బెంచ్ నిరాకరించిన విషయాన్ని గుర్తు చేసిన ధర్మాసనం.. ప్రధాన న్యామూర్తి అనుమతిస్తేనే విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. బుధవారం సీజే పర్మిషన్ తీసుకుంటామని అడ్వొకేట్ జనరల్ చెప్పడంతో కేసు విచారణ బుధవారానికి వాయిదా వేసింది. అయితే బుధవారం హైకోర్టులో విచారణ జరగకుండానే.. నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడమే కాకుండా వెంటనే విచారణకు తీసుకోవాలని .. కోరడం రాజకీయవర్గాలను ఆశ్చర్య పరిచింది.
ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ కు సంబంధించి ధర్మాసనం ప్రభుత్వానికి పలు ప్రశ్నలు వేసింది. ఫాం హౌస్ కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందా అని ప్రశ్నించగా.. ఇంకా చేయలేదని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు చెప్పారు. కేసు డైరీ కోసం సీబీఐ ఒత్తిడి చేస్తున్న విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు వారం రోజుల సమయం అవసరమని చెప్పారు. మరోవైపు ఫాం హౌస్ కేసును విచారణను సీబీఐకు బదిలీ చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ న్యాయమూర్తికి విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం సీజే అంగీకరిస్తే పిటిషన్ టేకప్ చేస్తామని ప్రకటించిన న్యాయమూర్తి తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.
ఫామ్ హౌస్ కేసు అనేక రకాల మలుపులు తిరుగుతోంది. మొదట సిట్ విచారణ జరపగా.. నిందితులు .. సిట్ పై నమ్మకం లేదని సీబీఐ దర్యాప్తు కావాలని పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. సిట్ దర్యాప్తు తీరు.. ముందుగానే సాక్ష్యాలు బయటకు రావడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సీబీఐకి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కేసు సీబీఐకి వెళ్తే రాజకీయంగా ఇబ్బందులు పడతామని గట్టి నిర్ణయానికి వచ్చిన్ బీఆర్ఎస్.. న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకుంది. వెంటనే.. సుప్రీంకోర్టుకూ వెళ్లింది. ఎలాగైనా కేసులో సీబీఐ విచారణ ప్రారంభించకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారారు.
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Indian Railways: రైళ్లపై రాళ్లు రువ్వితే కేసులు మామూలుగా ఉండవు - రైల్వేశాఖ వార్నింగ్
KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్
TSPSC Exam Postpone: పేపర్ల లీకుల ఎఫెక్ట్ - హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా, కొత్త తేదీ ప్రకటించిన టీఎస్ పీఎస్సీ
TSPSC Paper Leak: 'గ్రూప్-1' మెయిన్స్ పేపర్ కూడా లీకయ్యేదా? బయటపడుతున్న కుట్రలు!
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!
KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?
Anupama Parameswaran Photos: శారీలో సొగసుల అనుపమ