CM KCR: సీఎం కేసీఆర్ మెదక్ పర్యటన వాయిదా, కారణం ఏంటంటే?
CM KCR: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన వాయిదా పడింది. అయితే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది.
CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన వాయిదా పడింది. హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసిన కారణంగా సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. కాగా ముఖ్యమంత్రి ఈనెల 19వ తేదీన మెదక్ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా.. వాతావరణ శాఖ అధికారుల సూచనలతో వాయిదా వేశారు. ఈక్రమంలోనే ఈనెల 19కి బదులుగా ఇదే నెల 23వ తేదీన పర్యటించబోతున్నట్లు సమాచారం. ఆరోజే మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు ఎస్పీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తారు. ఆ తర్వాత పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడతారు. ముఖ్యమంత్రి పర్యటన వాయిదా పడడంతో కార్యకర్తలు కొంత నారశకు గురయ్యారు.
Read Also: BJP Leaders Fight: స్వాతంత్య్ర దినోత్సవాల్లో బీజేపీ నాయకుల కొట్లాట, జెండా సాక్షిగా ఘర్షణ