By: ABP Desam | Updated at : 09 Sep 2021 08:09 AM (IST)
డ్రోన్ల ద్వారా కోవిడ్ వ్యాక్సిన్లు
టెక్నాలజీ సాయంతో రూపొందిన 'మెడిసన్ ఫ్రం స్కై'.. కార్యక్రమం ప్రారంభానికి రంగం సిద్ధమైంది. డ్రోన్ల ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ సరఫరాను అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. దేశవ్యాప్తంగా అమలుచేయనున్న ఈ కార్యక్రమం.. తెలంగాణ నుంచే షురు కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టు ఈ నెల 11న ప్రారంభం కానుంది. మంత్రి కేటీఆర్.. విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి ఈ డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
తొలుత జిల్లా కేంద్రాల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లు చేరవయనున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. మొదటి రోజు జిల్లా పరిధిలో ఉన్న 5 పీహెచ్‌సీలకు డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లు చేరవేస్తారు. వికారాబాద్ మండల పరిధిలోని సిద్దులూరు, వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రామయ్యగూడ, ధారూర్ మండల పరిధిలోని నాగసముందర్, బంట్వారం, బొంరాస్‌పేట పీహెచ్‌సీలకు మందులను సరఫరా చేస్తారు.
నేడు, రేపు ట్రయల్ రన్ ..
దీనికి సంబంధించిన ట్రయల్ రన్ కార్యక్రమం నేడు, రేపు నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. స్కై ఎయిర్ మొబిలిటీ, బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ స్టారప్ సంస్థలు సంయుక్తంగా ఈ ట్రయల్ రన్ నిర్వహిస్తాయని ట్వీట్ చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా మందులు, కోవిడ్ వ్యాక్సిన్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రి చెప్పారు. ఇది విజయవంతం అయితే టెక్నాలజీ ఆధారంగా కోవిడ్ వ్యాక్సిన్ సరఫరా చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర లిఖిస్తుందని తెలిపారు.
ట్రయల్ రన్ లో భాగంగా ఈ రెండు రోజులు డ్రోన్లు కనుచూపు మేర నుంచి 500–700 మీటర్ల దూరం వరకు ప్రయాణించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. శనివారం (ఈ నెల 11) నుంచి 9–10 కి.మీ దూరంలోని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా సరఫరా చేయడాన్ని ప్రారంభిస్తారు.
దేశంలో ఇదే తొలిసారి..
అధికారులు మెడిసన్ ఫ్రం స్కై కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు. విమానయాన శాఖ, పోలీసు శాఖల అనుమతులతో పాటు పీహెచ్‌సీలకు సరఫరా చేయాల్సిన టీకా బాక్సులు, నిల్వ వంటి పలు అంశాలను పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్లు ఆకాశంలో ఎగరడం, గమ్యస్థానాలకు చేరే వరకు మానిటర్ చేయడం, వాటి రక్షణ వంటి వాటిని పోలీసు శాఖ పర్యవేక్షిస్తుంది.
Hyderbad Crime : ఆన్లైన్ లో కాంటాక్ట్ చేసి హైదరాబాద్ కు రప్పించి, వ్యాపారి నుంచి డైమండ్ కొట్టేసిన కేటుగాడు
Adilabad News : కట్టెల కోసం వెళ్లిన ఆదివాసీపై అటవీ అధికారుల దాడి, విషమంగా ఆరోగ్య పరిస్థితి
Traffic Challans: సామాన్యుడికి ఓ న్యాయం - సార్లకో న్యాయమా ? బోత్ ఆర్ నాట్ సేమ్ ఎందుకు!
BRS Joinings : బీఆర్ఎస్లో చేరిన ఒడిషా మాజీ సీఎం సహా కీలక నేతలు - మహాభారత్ను నిర్మిద్దామని కేసీఆర్ పిలుపు !
Puvvada Ajay Kumar :మంత్రి పువ్వాడ అజయ్ కు కోర్టు ధిక్కరణ నోటీసులు
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్కు 6,455 మంది ఎంపిక!
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్కు పేర్ని నాని కౌంటర్ !
Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?