News
News
X

Horoscope Today :ఇవాళ ఈ రాశుల వారు శుభవార్త వింటారు, ఆ రాశుల ఉద్యోగులకు అంతా శుభసమయమే..ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..!

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 
 

2021 సెప్టెంబరు 9 గురువారం రాశిఫలాలు

మేషం

ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి.  ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు మీరు అప్రమత్తంగా ఉండండి. ఎప్పటి నుంచో రావాల్సిన మొత్తం చేతికందుతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. భాగస్వామి ఆరోగ్యం జాగ్రత్త. పిల్లల వైపు నుంచి శుభవార్త వింటారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కార్యాలయ వాతావరణం సాధారణంగా ఉంటుంది. ఎక్కువ ఒత్తిడి తీసుకోవద్దు.

వృషభం

ఈ రోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. వివాహితులు సంతోషంగా ఉంటారు. వ్యాపారవేత్తలకు కొన్ని ఇబ్బందులు తప్పవు. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. పిల్లలతో సమయం గడపగలుగుతారు. ఏ పనీ వాయిదా వేయొద్దు. సామాజిక బాధ్యత నిర్వర్తించగలుగుతారు. ఒత్తిడి దూరమవుతుంది. సంతోషంగా ఉంటారు. ప్రభుత్వానికి సంబంధించిన పనులు పూర్తవుతాయి.

మిథునం

ఈరోజు చేసే లావాదేవీ విజయవంతమవుతాయి. భూమి లేదా వాహనాల కొనుగోలు దిశగా అడుగు మందుకు పడుతుంది. మీ ఆలోచన తప్పుదోవ పట్టొచ్చు..ఆచి తూచి అడుగేయండి. మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. మాట్లాడేటప్పుడు దూషించే  పదాలు ఉపయోగించవద్దు.

Also read: చిత్ర విచిత్రాల నిలయం ఈ గణపయ్య ఆలయం

News Reels

కర్కాటక రాశి

మీరు మంచిరోజు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. స్నేహితుల నుంచి సహాయం పొందుతారు. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగులు బదిలీ నోటీసులు పొందవచ్చు.దేవుడిపై భక్తి పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించే సూచనలున్నాయి. ఏ పని చేసినా జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.

సింహం

ఈ రోజంతా మీకు గందరగోళంగా ఉంటుంది. ఒకరి మాటల వల్ల మీరు బాధపడొచ్చు. స్నేహితులతో దీర్ఘకాలంగా ఉన్న విభేదాలు పరిష్కారమవుతాయి. విద్యార్థులకు మంచి రోజు. లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. శత్రువులు చురుకుగా వ్యవహరిస్తారు. వివాహితులు సంతోషంగా ఉంటారు. పిల్లల సమస్యలు పరిష్కారం అవుతాయి.

కన్య

మీరు శుభవార్త వింటారు. ఆరోగ్యంలో ఒడిదొడుకులు ఉంటాయి. అనవసరమైన ఖర్చులు తగ్గించండి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. విలువైన వస్తువుల భద్రతపై శ్రద్ధ వహించాలి. విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. మీరు మీ బాధ్యతను నెరవేర్చగలరు. పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం.

ALso read: రాముడి కన్నా ముందే రావణుడిని ఓడించిన రాజెవరో తెలుసా?

తులారాశి

మీ సమస్యలు కొన్ని తొలగిపోతాయి. కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన పనులు ప్రారంభిస్తారు. బాధ్యతలు పూర్తి చేయగలరు. కుటుంబ సభ్యుడి ఆరోగ్యం క్షీణించవచ్చు. బంధువుతో విభేదాలు తలెత్తవచ్చు. వ్యాపారస్తులు లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.

వృశ్చికరాశి

వృశ్చిక రాశివారి ఆరోగ్యం బావుంటుంది. సహోద్యోగులతో వివాద సూచనలున్నాయి. బాధ్యతలు సరిగా నిర్వర్తించలేరు. అప్పిచ్చిన మొత్తం చేతికందుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.  జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంటుంది. కొత్త సమాచారాన్ని పొందుతారు.

ధనుస్సు

అనవసర ప్రయాణాలు చేయవద్దు. స్థిరాస్తులకు సంబంధించిన పనులు పూర్తవుతాయి. కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. మంచి వ్యక్తులతో చర్చను ఆనందిస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.

Also read:తెలుగు సంవత్సరాల పేర్లకి నారదుడికి లింకేంటి?

మకరం

మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉండొచ్చు. ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సఫలమయ్యే సూచనలున్నాయి. ఈరోజు ఆకస్మిక ధనలాభం ఉండొచ్చు. అనవసరంగా ఒత్తిడికి గురికావొద్దు. విద్యార్థులు విజయం సాధిస్తారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. ప్రత్యర్థులు మీకు హాని కలిగించవచ్చు.

కుంభం

మీరు మీ కెరీర్‌కు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ఉద్యోగాలు మారేవారికి ఇదే శుభసమయం. ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది. బయట తినొద్దు. అనారోగ్య సూచనలున్నాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. కెరీర్ సంబంధిత విషయాల్లో కొంచెం కష్టపడాలి.

మీనం

మీ ప్రతిష్ట పెరుగుతుంది. అవసరమైన వారికి సహాయం చేయడంలో ముందుంటారు. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. లావాదేవీలు చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉండకండి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ సమాచారం అందే సూచనలున్నాయి. అత్తింటి వారివైపు నంచి శుభవార్తలు పొందొచ్చు. ఈ రోజంతా బావుంటుంది.

Also Read: ఈ వారం మూడు రాశులవారికి చాలా ప్రత్యేకం.. మిగిలిన రాశుల వారికి ఈ వారం ఎలా ఉందో చూడండి..

Published at : 09 Sep 2021 06:29 AM (IST) Tags: Horoscope Today Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces 9September 2021 Horoscope

సంబంధిత కథనాలు

Horoscope Today 3rd  December 2022:  ఈ రాశివారు ధీమా వీడకపోతే  వీరిని నమ్ముకున్నవారు మునిగిపోతారు, డిసెంబరు 3 రాశిఫలాలు

Horoscope Today 3rd December 2022: ఈ రాశివారు ధీమా వీడకపోతే వీరిని నమ్ముకున్నవారు మునిగిపోతారు, డిసెంబరు 3 రాశిఫలాలు

Indian Festivals Calendar 2023: 2023 లో ముఖ్యమైన రోజులు, పండుగలు ఇవే

Indian Festivals Calendar 2023: 2023 లో ముఖ్యమైన రోజులు, పండుగలు ఇవే

Love Horoscope Today 2nd December 2022: ఈ రాశివారు జీవిత భాగస్వామిపై అపనమ్మకం వీడాలి

Love Horoscope Today 2nd December 2022:  ఈ రాశివారు జీవిత భాగస్వామిపై అపనమ్మకం వీడాలి

Horoscope Today 2nd December 2022: ఈ 6 రాశుల వారికి అదృష్టమే అదృష్టం, డిసెంబరు 2 రాశిఫలాలు

Horoscope Today 2nd  December 2022: ఈ 6 రాశుల వారికి అదృష్టమే అదృష్టం, డిసెంబరు 2 రాశిఫలాలు

Spirituality: చేతులకు రంగురంగుల దారాలు ఎందుకు కడతారు, ఆంతర్యం ఏంటి!

Spirituality: చేతులకు రంగురంగుల దారాలు ఎందుకు కడతారు, ఆంతర్యం ఏంటి!

టాప్ స్టోరీస్

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు  గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

Viral News: గురివింద మొక్క నాగుపాము కంటే డేంజర్ అంటే నమ్ముతారా!

Viral News: గురివింద మొక్క నాగుపాము కంటే డేంజర్ అంటే నమ్ముతారా!

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

TS News Developments Today: తెలంగాణలో ఇవాళ ఉన్న మెయిన్ ఇష్యూస్ ఏంటంటే?

TS News Developments Today: తెలంగాణలో ఇవాళ ఉన్న మెయిన్ ఇష్యూస్ ఏంటంటే?