Medigadda Issue : మేడిగడ్డ మోటార్లు ఆన్ చేస్తామన్న కేటీఆర్ - బ్యారేజ్ కొట్టుకుపోతే బాధ్యత ఎవరిదన్న ఉత్తమ్ !
KTR : నీళ్లు ఎత్తిపోయకపోతే తామే మేడిగడ్డ మోటార్లు ఆన్ చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. అయితే బ్యారేజ్ కొట్టుకుపోతే ఎవరిది బాధ్యతని మంతి ఉత్తమ్ ప్రశ్నించారు.
Telangana politics is running around Medigadda barrage : కాళేశ్వరం ప్రాజెక్టు గురించి BRS పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం గురించి తెలంగాణ సమాజం నిజాలు తెలుసుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
35వేల ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ను రిడిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి BRS 94వేల కోట్లు ఖర్చు చేసిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 90వేలకు పైగా ఖర్చు చేసినా కాళేశ్వరం పూర్తి కాలేదు...పూర్తి కావాలంటే 1లక్ష 40వేల కోట్లకు ఖర్చు అవుతుందన్నారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మైంటనేన్స్ కోసం ప్రతి ఏటా 15వేల కోట్లు ఖర్చు అవుతుందని.. ప్రాజెక్టు పూర్తి అయితే అన్ని ఖర్చులు కలిపి ప్రతీ ఏటా 25వేల కోట్లు అవుతుందని రిపోర్టులు బయట పెట్టారు. కేసీఆర్ ప్రభుత్వం ఇరిగేషన్ సెక్టార్ ను సర్వనాశనం చేసిందన్నారు. అధికారంలో ఉన్నా - ప్రతిపక్షంలో ఉన్న BRS వాళ్ళు కాళేశ్వరం ను పిక్నిక్ స్పాట్ చేశారని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు మెడిగడ్డ గుండెకాయ అన్నారు. కాళేశ్వరం కట్టినప్పుడు BRS కేసీఆర్ అధికారంలో ఉంది ...అది కుంగినప్పుడు కూడా కేసీఆర్ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారన్నారు. లకాళేశ్వరంను సర్వనాశనం చేసి మళ్ళీ ఇప్పుడు BRS దొంగనాటకాలు ఆడుతోందనన్నారు. నీళ్లు ఎత్తిపోయారని అంటున్నారని.. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో NDSA సూచనల మేరకు ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.
బ్యారేజిలో నీళ్లు వదలాలి చెప్పింది కాబట్టే మేము గేట్లు ఎత్తి పెట్టామని.. మేడిగడ్డ వద్ద నీళ్లు స్టోరేజ్ చేస్తే గోదావరి పరివాక ప్రాంతాలు మునుగుతాయన్నారు. కేటీఆర్ కంటే NDSA కు తెలివి ఎక్కువ ఉంది అనుకుంటున్నామని.. సెటైర్ వేశారు. మీరే నాశనం చేసి...మళ్ళీ మీరే పంప్ లను ఆన్ చేస్తా అనడం విడ్డూరమని..
ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ను అపరెట్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని.. ఎల్లంపల్లి వద్ద రెండు మూడు రోజుల్లో పంపింగ్ మొదలు పెడతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అన్నారం 11 మీటర్ల వద్ద పంపింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ.. అన్నారం బ్యారేజి వద్ద 5 మిటర్లకే బుంగలు పడిందన్నారు. మా ప్రభుత్వం NDSA సూచనల మేరకు మూడు బ్యారేజీల నుంచి నీళ్లను వదిలేయాలని నిర్ణయించామని స్పష్టం చేశారు.
మేడిగడ్డ పర్యటనకు వెళ్లిన కేటీఆర్ ఆగస్ట్ 2 లోపు కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మోటార్లను ఆన్ చేసి నీటిని ఎత్తిపోయకుంటే 50 వేల మంది రైతులతో కలిసి మోటార్లను మేమే ఆన్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ మీద కక్షతో రైతుల నోట్లో మట్టికొట్టే దుర్మార్గపు ఆలోచన చేయవద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. పదిలక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతున్నాయన్నారు. ఈ నీటిని సకాలంలో ఎత్తిపోసుకుంటే శ్రీరాంసాగర్, ఎల్ఎండీ, మిడ్ మానేర్, రంగనాయకమ్మ సాగర్, కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ జలాశయాలను నింపుకొని నీటి కొరత లేకుండా చేసుకోవచ్చని అన్నారు. దీనిపైనే ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు.