KTR Gadwal Tour: గద్వాలలో కేటీఆర్ పర్యటన.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. విపక్ష నేతల ముందస్తు అరెస్టు
మంత్రి కేటీఆర్ గద్వాల్ పర్యటనలో ఉన్నారు. అలంపూర్ నియోజకవర్లంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్ యార్డు ఆవరణలో నిర్మించనున్న వంద పడకల ఆస్పత్రికి కేటీఆర్ భూమిపూజ చేశారు. గద్వాల్ పర్యటనలో భాగంగా మరికొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అంతకుముందు మంత్రి కేటీఆర్.. బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లారు. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి కూడా ఉన్నారు.
Also Read: Ganesh Immersion: గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై సుప్రీం కోర్టుకు తెలంగాణ సర్కార్
కేటీఆర్ గద్వాల్ పర్యటన కారణంగా కొన్ని రోజులు విపక్షాలు నిరసన గళం ఎత్తాయి. దీంతో బందోబస్తులో భాగంగా పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి ఐజ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అలంపూర్‌లోని కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ముందస్తు అరెస్టులు సరైనవి కావని.. కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Saidabad Girl Rape: సైదాబాద్ చిన్నారి హత్యాచార కేసు.. నిందితుడు ఎక్కడ.. సాయం చేసింది అతడి ఫ్రెండేనా?
2014 నుంచి పలుమార్లు గద్వాల నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్, కేసీఆర్.. హామీలను నెరవేర్చలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. తుమిళ్ల ఎత్తిపోతల, జూరాల ఆయకట్టు విస్తరణ, గుర్రంగడ్డ వంతెన, గట్టు ఎత్తిపోతల హామీలు నీటమూటలుగానే మిగిలిపోయాయని చెబుతున్నాయి. గద్వాల్ వైద్యకళాశాలను ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే భరత సింహారెడ్డి డిమాండ్ చేశారు. టెక్స్‌టైల్ పార్కుతోపాటు పలు శంకుస్థాపనలు చేసిన పనులను పూర్తి చేశాకే.. కేటీఆర్ జిల్లాకు రావాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ అన్నారు.
Also Read: TS Congress : టీ కాంగ్రెస్‌లో మళ్లీ జూలు విదిలిస్తున్న గ్రూపులు ! ఐక్యత ఎండ మావేనా ?
Also Read: Weather Report: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఇవాళ, రేపు వర్షాలు..