News
News
X

Saidabad Girl Rape: సైదాబాద్ చిన్నారి హత్యాచార కేసు.. నిందితుడు ఎక్కడ.. సాయం చేసింది అతడి ఫ్రెండేనా?

హైదరాబాద్ లోని సైదాబాద్ హత్యాచార ఘటనపై ఇంకా అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిందితుడు పల్లంకొండ రాజును తప్పించేందేకు అతడి స్నేహితుడు సాయం చేసినట్టు తెలుస్తోంది.

FOLLOW US: 
 
సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి హత్యాచార నిందితుడిని అరెస్టు చేశామని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే దీనిపై పోలీసులను ప్రశ్నిస్తుండగా.. పోలీసులు మాత్రం రాజు ఆచూకీ ఇంకా దొరకలేదని.. పది బృందాలతో గాలిస్తున్నామని చెబుతున్నారు. 

చిన్నారిపై కన్నేసిన రాజు నాలుగు రోజుల క్రితం చాక్లెట్‌ ఆశ చూపించి బాలికను తీసుకెళ్లాడు. దారుణంగా చిన్నారిని హత్యచేసి శవాన్ని తన గదిలో ఉంచి తాళం వేసి బయటకు వెళ్లాడు. బాలిక తల్లిదండ్రులు అతడిపై అనుమానం వ్యక్తం చేసినా పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. అయితే చిన్నారి కోసం పోలీసులు, తల్లిదండ్రులు, స్థానికులు వెతుకుతుండగా.. రాజు స్నేహితుడు అతడిని పక్కకు తీసుకెళ్లి.. పారిపోవాలంటూ చెప్పినట్లు తెలిసింది. అక్కడున్నవారు గుర్తుపట్టకుండా ఉండేందుకు టోపీ, మాస్కు, తువ్వాలు, ఒక జత దుస్తులు ఇచ్చి పంపించాడని అక్కడి వారు చెబుతున్నారు. 

అయితే.. స్థానికులు చెబుతున్నది నిజమనేలా ఉన్నాయి. సీసీ కెమెరాలో రాజుతోపాటు అతడి ఫ్రెండ్ వెళ్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.

యాదాద్రిభువనగిరి జిల్లా చందంపేట్ మండలం నుంచి హైదరాబాద్ వచ్చి ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు రాజు. చిల్లర దొంగతనాలు చేస్తూ ఆ ఏరియాలో జనాలతో రాజు దురుసుగా వ్యవహరిస్తూ ఉండేవాడు. పాపను అతడే ఏమైనా చేశాడేమోనన్న అనుమానంతో అర్థరాత్రి సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా అతని గదిలో ఆ చిన్నారి విగత జీవిగా పడి ఉంది. సాయంత్రం వరకూ ఆడుకుంటూ కనిపించిన తమ బిడ్డ అలా ఓ కిరాతకుడికి బలైపోవడం చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. 

News Reels

ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడి చేరుకున్న పోలీసులు క్లూస్ సేకరించారు. అయితే నిందితుడు రాజును తమకు అప్పగించే వరకూ పాప మృతదేహాన్ని అక్కడి నుంచి తీసేది లేదని బస్తీవాసులంతా నిరసనకు దిగారు. పోలీసులు వారికి నచ్చజెప్పి.. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని చెప్పారు.   బాలిక మృతదేహానికి ఉస్మానియా మార్చురీలో వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. అత్యాచారం చేసి గొంతునులిమి చిన్నారిని హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబసభ్యులుకు అప్పగించారు.

Also Read: Watch: రేప్ ఘటనపై ఆలోచింపజేస్తున్న సైకత శిల్పం

Also Read: B.Tech Student Death: ఫ్రెండ్స్‌తో పార్టీకెళ్లాడు, వస్తుండగా క్షణాల్లో శవమయ్యాడు.. మిస్టరీగా కేసు, ఇంతకీ అసలేం జరిగింది?

Also Read: Nalgonda: ఇంట్లో ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన కోడలు.. చూసేసిన మామయ్య, చివరికి దారుణం

Published at : 14 Sep 2021 07:25 AM (IST) Tags: Hyderabad crime news saidabad rape case saidabad girl rape case update saidabad rapist news friend help to rapist in hyderabad

సంబంధిత కథనాలు

Karimnagar Crime :  ఆడపిల్లలను కొనుగోలు చేసి వ్యభిచార కూపంలోకి, వ్యభిచార ముఠా గుట్టురట్టు!

Karimnagar Crime : ఆడపిల్లలను కొనుగోలు చేసి వ్యభిచార కూపంలోకి, వ్యభిచార ముఠా గుట్టురట్టు!

Tirupati Boys Missing : తిరుపతిలో నలుగురు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అదృశ్యం!

Tirupati Boys Missing : తిరుపతిలో నలుగురు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అదృశ్యం!

Money Laundering : మనీలాండరింగ్‌ అంటే ఏంటి? హవాలా మనీకి మనీలాండరింగ్‌కు తేడా ఏంటి?

Money Laundering : మనీలాండరింగ్‌ అంటే ఏంటి? హవాలా మనీకి మనీలాండరింగ్‌కు తేడా ఏంటి?

Hyderabad Crime News: కోరిక తీర్చు, లేదంటే నగ్న చిత్రాలు బయటపెడతా - టీవీ యాంకర్ ను వేధిస్తున్న యువకుడు!

Hyderabad Crime News: కోరిక తీర్చు, లేదంటే నగ్న చిత్రాలు బయటపెడతా - టీవీ యాంకర్ ను వేధిస్తున్న యువకుడు!

Alluri Sitarama Raju District: భూసర్వే టార్గెట్‌లు, ఉన్నతాధికారుల మాటలు పడలేక తహసీల్దార్ ఆత్మహత్య!

Alluri Sitarama Raju District: భూసర్వే టార్గెట్‌లు, ఉన్నతాధికారుల మాటలు పడలేక తహసీల్దార్ ఆత్మహత్య!

టాప్ స్టోరీస్

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

తీవ్ర తుపానుగా మ్యాన్‌డౌస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

తీవ్ర తుపానుగా మ్యాన్‌డౌస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Airport Metro : లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !

Airport Metro :  లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !