అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source:  Poll of Polls)

B.Tech Student Death: ఫ్రెండ్స్‌తో పార్టీకెళ్లాడు, వస్తుండగా క్షణాల్లో శవమయ్యాడు.. మిస్టరీగా కేసు, ఇంతకీ అసలేం జరిగింది?

ఇంటి నుంచి సంతోషంగా వెళ్లిన తమ యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. దీంతో కన్న తల్లితండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

స్నేహితుడి పుట్టిన రోజు పార్టీ కోసం తన ఊరికి చెందిన ఇద్దరు స్నేహితులతో కలిసి ఇంటి నుంచి సంతోషంగా వెళ్లిన యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. దీంతో కన్న తల్లితండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. తన కుమారునిది ముమ్మాటికి పథకం ప్రకారం హత్యే చేశారని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం బెండమూర్లంక గ్రామానికి చెందిన ఈలి వీరవెంకట రమేష్‌ అనే 20 ఏళ్ల వ్యక్తి ఓడలరేవులోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ఇతనితోపాటు ఇదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు ఇదే కళాశాలలో చదువుతున్నారు. అయితే మామిడికుదురు మండలానికి చెందిన వీరందరు స్నేహితుడి పుట్టిన రోజు అని మొత్తం 18 మంది యువకులంతా కలిసి ఈ నెల 10న(శనివారం) పాశర్లపూడి వద్ద నున్న ఓ రిసార్ట్స్‌లో రూమ్స్‌ బుక్‌ చేసుకుని రాత్రంతా అక్కడే గడిపారు. 

11న(ఆదివారం) ఉదయం పదిగంటల సమయంలో ఎవరి ఇళ్లకు వాళ్లు తిరిగి వచ్చేస్తున్న క్రమంలో అల్లవరం వచ్చేసరికి స్నేహితుని బైక్‌ మీద వెనుక కూర్చున్న మృతుడు వీరవెంకట రమేష్‌ ఓ వైపుకు వాలిపోతూ పడిపోతుండగా బైక్‌ ఆపి చూసేసరికి కిందపడిపోయి అపస్మారక స్థితిలో ఉన్నాడని ఇద్దరు స్నేహితులు చెపుతున్నారు. స్పృహలోలేని రమేష్‌ను దగ్గర్లో ఉన్న అల్లవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లామని, అయితే అప్పటికే రమేష్‌ మృతిచెందాడని అక్కడి వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనపై మృతుడు రమేష్‌ తల్లితండ్రులకు ఫోన్‌ ద్వారా స్నేహితులు సమాచారం ఇచ్చారు.

అయితే తమ కుమారుడు పూర్తి ఆరోగ్యంతో ఉంటాడని, ఎప్పుడూ ఏ చిన్న నలత లేని వాడు ఇలా అకస్మాత్తుగా ఎందుకు చనిపోతాడని మృతుని తల్లితండ్రులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై విచారణ చేపట్టి తమ కుమారుడు ఎలా చనిపోయాడో నిగ్గుతేల్చాలని అల్లవరం పోలీస్‌ స్టేషన్‌ వద్దకు ఆదివారం సాయంత్రం పెద్ద ఎత్తున మృతుడి కుటుంబీకులు, బందువులు తరలివచ్చారు. మృతదేహాన్ని పరిశీలించిన అమలాపురం రూరల్‌ సీఐ సురేష్‌బాబు, అల్లవరం ఎస్సై ప్రభాకర్‌రావులు కేసు నమోదు చేసి పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఇంతకీ రిసార్టులో ఏం జరిగింది? 
బోడసకుర్రు పాశర్లపూడి మధ్య వైనతేయ నదీ పాయపై ఉన్న బ్రిడ్జికి ఆనుకునే ఈ రిసార్ట్ ఉంది. ఇక్కడే శనివారం రాత్రి ఈ యువకులంతా బర్త్‌డే పార్టీ చేసుకున్నారని తెలుస్తోంది. రాత్రంతా 18 మంది వరకు అక్కడే పార్టీ చేసుకున్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా 20 ఏళ్లు నిండకుండానే వీరంతా మద్యం సేవించినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది. మృతుడి తల్లితండ్రులు ఆరోపిస్తున్నట్లు మృతి వెనుక కుట్రకోణం దాగి ఉందా లేక మద్యం సేవించడం వల్ల ఏమైనా జరిగిందా అన్నది పోస్ట్‌మార్టం ఆధారంగా జరిగే పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PPP Model Chandrababu:  ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
Weather Update Today: ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
Aditi Shankar: పాలకొల్లులో 'గేమ్ ఛేంజర్' దర్శకుడి కూతురు... శ్రీనివాస్ బెల్లకొండతో క్యూట్ లవ్ సాంగ్ కోసం!
పాలకొల్లులో 'గేమ్ ఛేంజర్' దర్శకుడి కూతురు... శ్రీనివాస్ బెల్లకొండతో క్యూట్ లవ్ సాంగ్ కోసం!
AP Cabinet: టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలుఅరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PPP Model Chandrababu:  ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
Weather Update Today: ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
Aditi Shankar: పాలకొల్లులో 'గేమ్ ఛేంజర్' దర్శకుడి కూతురు... శ్రీనివాస్ బెల్లకొండతో క్యూట్ లవ్ సాంగ్ కోసం!
పాలకొల్లులో 'గేమ్ ఛేంజర్' దర్శకుడి కూతురు... శ్రీనివాస్ బెల్లకొండతో క్యూట్ లవ్ సాంగ్ కోసం!
AP Cabinet: టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Allu Arjun: భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
Paritala Sunitha: మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులు జాకీని వెళ్లగొట్టారు, తక్షణం చర్యలు చేపట్టాలి: పరిటాల సునీత
మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులు జాకీని వెళ్లగొట్టారు, తక్షణం చర్యలు చేపట్టాలి: పరిటాల సునీత
Karthika Vanabhojanam 2024: కార్తీక సమారాధన అంటే క్యాటరింగ్ భోజనాలు కాదు..అసలైన వనభోజనాలంటే ఇవి!
కార్తీక సమారాధన అంటే క్యాటరింగ్ భోజనాలు కాదు..అసలైన వనభోజనాలంటే ఇవి!
Amla Soup : చలికాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు రోగనిరోధక శక్తిని పెంచే సూప్.. సింపుల్ రెసిపీ, మరెన్నో హెల్త్ బెనిఫిట్స్
చలికాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు రోగనిరోధక శక్తిని పెంచే సూప్.. సింపుల్ రెసిపీ, మరెన్నో హెల్త్ బెనిఫిట్స్
Embed widget