Gold-Silver Price: దేశంలో స్థిరంగా బంగారం ధరలు , తగ్గిన వెండి ... తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ఇలా...
భారత్‌లో బంగారం, వెండి ధరలు ఈ రోజు (సెప్టెంబరు 14) తటస్థంగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ భారత మార్కెట్‌లో రూ.43,990 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర తాజాగా రూ.47,990 గా ఉంది.
భారత మార్కెట్‌లో వెండి ధరలు నిన్నటితో పోలిస్తే కేజీకి రూ. 200 తగ్గింది. తాజాగా భారత మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.67,800గా కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.67,800గా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో సెప్టెంబరు 14న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి తాజా ధరలివీ
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర స్థిరంగా ఉంది. 24 క్యారెట్ల బంగారం (99.99) ధర ప్రస్తుతం రూ.47,990 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం (91.6) ధర రూ.43,990 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.67,800 పలికింది.
ఇక విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర సెప్టెంబరు 14న రూ.43,990 కాగా.. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.47,990గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.67,800గా ఉంది. విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,990 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,990గా ఉంది. ఇక్కడ కూడా వెండి ధర కిలోకు హైదరాబాద్ తరహాలోనే రూ.67,800 పలుకుతోంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు సెప్టెంబరు 14న ఇలా ఉన్నాయి. ముంబయిలో ఈరోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,010గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,010గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,390 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,390గా ఉంది. దిల్లీలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,140గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,340గా ఉంది
ప్లాటినం ధరలో తగ్గుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం ప్లాటినం ధర హైదరాబాద్‌లో గ్రాముకు ఆరు రూపాయలు తగ్గి రూ.2,245గా ఉంది. 10 గ్రాముల ప్లాటినం ధర ఇక్కడ రూ.22,450 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర అదే కొనసాగుతోంది.
వివిధ అంశాలపై పసిడి ధర
బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.
Also Read: Weather Report: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఇవాళ, రేపు వర్షాలు..