అన్వేషించండి

Telangana High Court: అసాంఘీక కార్యకలాపాలు జరగకపోతే స్పా సెంటర్ల పనితీరులో పోలీసులు జోక్యం చేసుకోలేరు: హైకోర్టు 

Telangana High Court: స్పా సెంటర్లలో ఎలాంటి అసాంఘీక కార్యకలాపాలు జరగకుండా పారదర్శంగా నిర్వహిస్తే వారి రోజువారీ నిర్వహణలో పోలీసులు జోక్యం చేసుకోలేరని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. 

 Telangana High Court: స్పా సెంటర్లు, మసాజ్ సెంటర్ల పని తీరుపై పోలీసులు జోక్యం చేసుకోలేరని తెలంగాణ హైకోర్టు తెలిపింది. అక్కడ ఎలాంటి అసాంఘీక కార్యకలాపాలు జరగకుండా, పారదర్శకంగా రోజువారీ కార్యకలాపాలు నిర్వహిస్తే... పోలీసులు స్పా సెంటర్ల పని తీరు గురించి ప్రశ్నించలేరని స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో స్పా సెంటర్‌కు చెందిన మూడు శాఖలు తమ వ్యాపారాన్ని నిర్వహించడానికి అనుమతించాలని జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి... హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను ఆదేశించారు. బంజారా హిల్స్‌లోని ది సెంట్‌ హోటల్‌, లక్డీకాపూల్‌, లోటస్‌ పాండ్‌, సోమాజి గూడలోని గాయత్రి బిల్డింగ్‌లో మూడు శాఖలను కలిగి ఉన్న సోమారా వెల్‌నెస్‌ స్పా డైరెక్టర్‌ సౌరభ్‌ కుమార్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన అనంతరం న్యాయమూర్తి ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

"స్పా సెంటర్లు సక్రమంగా నిర్వహిస్తూన్నా కేంద్రాలను మూసివేస్తున్నారు"

తమ స్పా సెంటర్ల రోజువారీ నిర్వహణలో పోలీసులు జోక్యం చేసుకుంటున్నారని, కేంద్రాలను మూసివేయాలని పిటిషనర్ కోరారు. అలాగే పోలీసులు చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించడం లేదని తరచుగా తమ కేంద్రాలను మూసివేస్తున్నారని అన్నారు. 2021 సెప్టెంబర్ 28వ తేదీన జారీ చేసిన ఆర్డర్‌లో.. స్పా, మసాజ్ సెంటర్ల నిర్వహణపై స్పష్టమైన మార్గదర్శకాలను హైకోర్టు నిర్దేశించినప్పటికీ... ఇది జరుగుతోందని చెప్పారు. సోమరా స్పా దాఖలు చేసిన ప్రస్తుత పిటిషన్‌ను డిస్పోజ్ చేస్తూ.. జస్టిస్ భాస్కర్ రెడ్డి 2021 ఆర్డర్‌కు అనుగుణంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలోనే కోర్టు 103 స్పా సెంటర్ల ఫిర్యాదులను విచారించి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. మసాజ్ సేవను పొందిన కస్టమర్ల రికార్డును నిర్వహించడం వంటి కొన్ని మార్గదర్శకాలు అందులో ఉన్నాయి. 

"మసాజ్ సెంటర్ల రికార్డులను ఎస్ఐ ఎప్పటికప్పుడు సరి చూసుకోవాలి"

ఆపోజిట్‌ జెండర్ నుంచి మసాజ్ సేవ కోరిన కస్టమర్ల సంప్రదింపు వివరాలు,  ఎవరు అలాంటి సేవను కోరుతున్నారో తెలుసుకోవడానికి పోలీసులకు వీలు కల్పిస్తుంది. ఈ నిర్థారణ పనిని ఎస్‌ఐ చేయాలి. ఎలాంటి అసాంఘీక కార్యకలాపాలకు ఆస్కారం లేకుండా క్రాస్ మసాజ్ సర్వీస్ ప్రొఫెషనల్ పద్ధతిలో చేయాలి. స్పా పని వేళల్లో స్పా సెంటర్ మెయిన్ డోర్ తెరిచి ఉంచాలి. ఈ మసాజ్ సెంటర్లు నిర్వహించే రికార్డులను కూడా ఎస్‌ఐ ఎప్పటికప్పుడు సరి చూసుకోవాలి. ఈ మసాజ్ సెంటర్ల నిర్వాహకులు ఏవైనా ఉల్లంఘనలకు పాల్పడినా లేదా నేరాలు చేసిననా పోలీసులు దర్యాప్తు చేయవచ్చు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Election Results 2025: ఢిల్లీ ఫలితాలు- ఎర్లీ ట్రెండ్స్‌లో కేజ్రీవాల్‌కు బీజేపీ బిగ్ షాక్ ! ఆప్ టైమ్ ముగిసిందా?
ఢిల్లీ ఫలితాలు- ఎర్లీ ట్రెండ్స్‌లో కేజ్రీవాల్‌కు బీజేపీ బిగ్ షాక్ ! ఆప్ టైమ్ ముగిసిందా?
New Income Tax Bill: కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం, వచ్చే వారం పార్లమెంట్‌లో బిల్లు
కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం, వచ్చే వారం పార్లమెంట్‌లో బిల్లు
Balakrishna Akhanda 2: ఈ శివరాత్రికి శివ'తాండవ'మేనా! - బాలకృష్ణ 'అఖండ 2' ఫస్ట్ లుక్‌ అప్పుడేనా?
ఈ శివరాత్రికి శివ'తాండవ'మేనా! - బాలకృష్ణ 'అఖండ 2' ఫస్ట్ లుక్‌ అప్పుడేనా?
YS Sharmila On jagan : జగన్ క్రెడిబులిటి ఖాళీ బాటిల్, సున్నా - బిడ్డల ఆస్తులు కాజేయాలని కుట్ర - షర్మిల సంచలన వ్యాఖ్యలు
జగన్ క్రెడిబులిటి ఖాళీ బాటిల్, సున్నా - బిడ్డల ఆస్తులు కాజేయాలని కుట్ర - షర్మిల సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Darien Gap Crossing in Telugu | మానవ అక్రమరవాణాకు దారి చూపెడుతున్న మహారణ్యం | ABP DesamAdvocate Serious on Hydra Ranganath | హైడ్రా కమిషనర్ పై చిందులేసిన అడ్వొకేట్ | ABP DesamMLC Candidate GV Sunder Interview | మూడు నినాదాలతో గ్రాడ్యుయేట్ MLC బరిలో ఉన్నా | ABP DesamVijaya Sai Reddy Counters YS Jagan | నేను ఎవడికీ అమ్ముడుపోలేదు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Election Results 2025: ఢిల్లీ ఫలితాలు- ఎర్లీ ట్రెండ్స్‌లో కేజ్రీవాల్‌కు బీజేపీ బిగ్ షాక్ ! ఆప్ టైమ్ ముగిసిందా?
ఢిల్లీ ఫలితాలు- ఎర్లీ ట్రెండ్స్‌లో కేజ్రీవాల్‌కు బీజేపీ బిగ్ షాక్ ! ఆప్ టైమ్ ముగిసిందా?
New Income Tax Bill: కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం, వచ్చే వారం పార్లమెంట్‌లో బిల్లు
కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం, వచ్చే వారం పార్లమెంట్‌లో బిల్లు
Balakrishna Akhanda 2: ఈ శివరాత్రికి శివ'తాండవ'మేనా! - బాలకృష్ణ 'అఖండ 2' ఫస్ట్ లుక్‌ అప్పుడేనా?
ఈ శివరాత్రికి శివ'తాండవ'మేనా! - బాలకృష్ణ 'అఖండ 2' ఫస్ట్ లుక్‌ అప్పుడేనా?
YS Sharmila On jagan : జగన్ క్రెడిబులిటి ఖాళీ బాటిల్, సున్నా - బిడ్డల ఆస్తులు కాజేయాలని కుట్ర - షర్మిల సంచలన వ్యాఖ్యలు
జగన్ క్రెడిబులిటి ఖాళీ బాటిల్, సున్నా - బిడ్డల ఆస్తులు కాజేయాలని కుట్ర - షర్మిల సంచలన వ్యాఖ్యలు
Thandel: 'తండేల్' రియల్ స్టోరీ... చేపల కోసం వెళ్ళి పాకిస్థాన్ చెరలో చిక్కుకున్న ఆ మత్స్యకారుడు ఎవరో తెలుసా?
'తండేల్' రియల్ స్టోరీ... చేపల కోసం వెళ్ళి పాకిస్థాన్ చెరలో చిక్కుకున్న ఆ మత్స్యకారుడు ఎవరో తెలుసా?
New Ration Cards: మీకు రేషన్ కార్డు లేదా? ఇలా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
మీకు రేషన్ కార్డు లేదా? ఇలా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
Jeet Adani Wedding: గౌతమ్ అదానీ ఇంట మెగిన పెళ్లిబాజాలు, ఇంటివాడైన జీత్ అదానీ- ఏకంగా రూ.10,000 కోట్ల విరాళం
గౌతమ్ అదానీ ఇంట మెగిన పెళ్లిబాజాలు, ఇంటివాడైన జీత్ అదానీ- ఏకంగా రూ.10,000 కోట్ల విరాళం
Sita Kalyanam: పెళ్లిళ్ల సీజన్ మొదలైంది.. పెళ్లికానివారు ఇది పారాయణం చేస్తే మంచి ఫలితం ఉంటుంది!
పెళ్లిళ్ల సీజన్ మొదలైంది.. పెళ్లికానివారు ఇది పారాయణం చేస్తే మంచి ఫలితం ఉంటుంది!
Embed widget