By: ABP Desam | Updated at : 02 Dec 2022 09:26 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
సీఎం కేసీఆర్
TS Govt : దివ్యాంగుల కోసం తెలంగాణ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం(డిసెంబరు 3) సందర్భంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. స్త్రీ, శిశు సంక్షేమశాఖలో భాగంగా ఉన్న దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమశాఖ విభాగాన్ని మంత్రిత్వ శాఖగా ఏర్పాటుచేసేందుకు నిర్ణయించింది. కొత్త మంత్రిత్వశాఖపై తెలంగాణ సర్కార్ శనివారం ఉత్తర్వులు జారీ చేయనుంది. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేకశాఖ ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దివ్యాంగుల, వృద్ధులు, ట్రాన్స్ జెండర్ల కోసం మంత్రిత్వశాఖ ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సీఎం కేసీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్లకు సంక్షేమం, ఇతర సేవలు అందించేందుకు వీలుగా జిల్లా స్థాయిలోనూ మహిళ, శిశు సంక్షేమ శాఖ నుంచి వీటిని వేరుచేశారు. వీటికి జిల్లా సంక్షేమ అధికారిని నియమించనున్నారు. మహిళ శిశు సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమ శాఖల మధ్య ప్రతి జిల్లాకు శాఖాపరమైన ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇది చిన్న చూపే.! కేసిఆర్ ప్రభుత్వంపై పద్మశ్రీ అవార్డు గ్రహీత సంచలన వ్యాఖ్యలు!
TTWREIS Admissions: తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి! వివరాలివే!
Love Marriage : ఖండాలు దాటిన ప్రేమ, ఒక్కటైన తెలంగాణ అబ్బాయి, నెదర్లాండ్స్ అమ్మాయి
Waltair Veerayya Success Event : వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభలో అపశృతి, తొక్కిసలాటలో పలువురికి గాయాలు
Himanshu Heads CAsnival : ఈ కాస్నివాల్ పర్యావరణం, విద్యకు మధ్య వారధి, ఈవెంట్ డబ్బులతో నానక్ రామ్ గూడ చెరువు పునరుద్ధరణ- హిమాన్షు
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!
Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?
Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!