అన్వేషించండి

RTI: ఆర్టీఐపై ఉత్తర్వులు వెనక్కి తీసుకుంటాం... హైకోర్టుకు స్పష్టం చేసిన తెలంగాణ సర్కార్

ఆర్టీఐపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. ఆర్టీఐ సమాచారంపై శాఖాధిపతుల అనుమతి తీసుకోవాలని ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటామని హైకోర్టుకు తెలిపింది.

సమాచార హక్కు(ఆర్టీఐ)పై ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఆర్టీఐ సమాచారం అందించేటప్పుడు శాఖాధిపతుల ముందస్తు అనుమతి తీసుకోవాలన్న ఉత్తర్వులు ఉపసంహరించుకుంది. అవసరమైతే శాఖాధిపతుల సలహా తీసుకోవాలని తాజా ఉత్తర్వులో పేర్కొంది. ఇతర విభాగాల సమాచారానికి శాఖాధిపతుల సహకారం తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది.  ఆర్టీఐపై ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ గతంలో హైకోర్టులో పిల్స్ దాఖలయ్యాయి. హైకోర్టులో విచారణ సందర్భంగా ఉత్తర్వులు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో సీజే ధర్మాసనం విచారణను ముగించింది. 

Also Read: క్యాంపులతో పట్టు నిలుపుకున్న టీఆర్ఎస్.. ఖమ్మంలో క్రాస్ ఓటింగ్ !

హైకోర్టు గతంలో స్టే

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీఐపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీఐ సమాచారంపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ఆర్టీఐ దరఖాస్తులకు ఇచ్చే సమాచారానికి సంబంధించి శాఖాధిపతుల నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వులపై గతంలో స్టే విధించింది. దీంతో తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. ఆర్టీఐ సమాచారంపై శాఖాధిపతుల ముందస్తు అనుమతి తీసుకోవాలన్న ఉత్తర్వులు వెనక్కి తీసుకుంటున్నామని, శాఖాధిపతుల సలహా తీసుకోవచ్చని తాజాగా ఉత్తర్వులు జారీ చేసినట్లు సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు. 

Also Read: ఆరోగ్య శ్రీ అమలులో నిర్లక్ష్యం వద్దు... వైద్య పరీక్షల్లో ఆలస్యం సహించబోం.. మంత్రి హరీశ్ రావు

అక్టోబర్ 13న ఉత్తర్వులు

సమాచార హక్కు చట్టంపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అక్టోబరు 13న జారీ చేసిన జీవోపై హైకోర్టు గతంలో స్టే విధించింది. ఆర్టీఐ చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా సీఎస్ నిర్ణయాలు ఉన్నాయని హైకోర్టు సీజే నేతృత్వంలో బెంచ్ తప్పుపట్టింది. ఈ సర్క్యూలర్‌లో అంశాలను అమలు చేయవద్దంటూ ఆదేశాలు చేసింది. సీఎస్ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆర్టీఐ కార్యకర్త గంజి శ్రీనివాసరావు సహా పలువురు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టు ప్రధాన న్యాయూమూర్తి ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

Also Read: యాదాద్రి ప్రారంభోత్సవానికి రండి.. ,. స్టాలిన్‌ను ఆహ్వానించిన కేసీఆర్ !

Also Read: TS MLC Election Results: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్.. అన్ని స్థానాలు గులాబీ కైవసం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Kumuram Bheem Asifabad Latest News: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దిందాలో రణరంగం! ప్లాంటేషన్ అడ్డుకున్న రైతులు! 
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దిందాలో రణరంగం! ప్లాంటేషన్ అడ్డుకున్న రైతులు! 
Hyderabad Rain Traffic Chaos: తొలకరి వానకు హైదరాబాద్ ఖల్లాస్ - ఐటీ కారిడార్‌లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.. నరకం అనే మాట చిన్నదే!
తొలకరి వానకు హైదరాబాద్ ఖల్లాస్ - ఐటీ కారిడార్‌లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.. నరకం అనే మాట చిన్నదే!
Breaking News: తెలంగాణలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్- 1వ తేదీన జీతాలు ఇవ్వాలని సీఎం ఆదేశం
తెలంగాణలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్- 1వ తేదీన జీతాలు ఇవ్వాలని సీఎం ఆదేశం
Hyderabad Heavy Rain Update 2026: భాగ్యనగరాన్ని దడదడలాడించిన తొలి రుతుపవన వర్షం - ట్రాఫిక్ కష్టాలు.. వాహనదారులకు పోలీసుల కీలక సూచనలు!
భాగ్యనగరాన్ని దడదడలాడించిన తొలి రుతుపవన వర్షం - ట్రాఫిక్ కష్టాలు.. వాహనదారులకు పోలీసుల కీలక సూచనలు!

వీడియోలు

Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kumuram Bheem Asifabad Latest News: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దిందాలో రణరంగం! ప్లాంటేషన్ అడ్డుకున్న రైతులు! 
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దిందాలో రణరంగం! ప్లాంటేషన్ అడ్డుకున్న రైతులు! 
Hyderabad Rain Traffic Chaos: తొలకరి వానకు హైదరాబాద్ ఖల్లాస్ - ఐటీ కారిడార్‌లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.. నరకం అనే మాట చిన్నదే!
తొలకరి వానకు హైదరాబాద్ ఖల్లాస్ - ఐటీ కారిడార్‌లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.. నరకం అనే మాట చిన్నదే!
Hyderabad Heavy Rain Update 2026: భాగ్యనగరాన్ని దడదడలాడించిన తొలి రుతుపవన వర్షం - ట్రాఫిక్ కష్టాలు.. వాహనదారులకు పోలీసుల కీలక సూచనలు!
భాగ్యనగరాన్ని దడదడలాడించిన తొలి రుతుపవన వర్షం - ట్రాఫిక్ కష్టాలు.. వాహనదారులకు పోలీసుల కీలక సూచనలు!
Vizag Steel Plant Accident Updates:
"స్టీల్‌ప్లాంట్ సమస్యలపై త్వరలోనే చర్చలు- రాజకీయాలకు అతీతంగా కార్మిక సంఘాలు పనిచేయాలి" డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్
Visakhapatnam Steel Plant Accident Nara Lokesh Visit:
"విశాఖ స్టీల్‌ప్లాంట్‌ బాధితులకు 90 రోజుల్లో న్యాయం" పరామర్శ తర్వాత లోకేష్‌ ప్రకటన
Job Resignation Reasons : జాబ్ మానేయాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందా? ఉద్యోగుల రాజీనామాల వెనుక అసలు కారణాలు ఇవే
జాబ్ మానేయాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందా? ఉద్యోగుల రాజీనామాల వెనుక అసలు కారణాలు ఇవే
Longest Serving PMs of India: నెహ్రూ రికార్డు బద్దలుకొట్టిన నరేంద్ర మోదీ.. సుదీర్ఘకాలం భారత ప్రధానిగా సేవలందించింది వీరే
నెహ్రూ రికార్డు బద్దలుకొట్టిన నరేంద్ర మోదీ.. సుదీర్ఘకాలం భారత ప్రధానిగా సేవలందించింది వీరే
Hyderabad Future City Legal Immunity: ఫ్యూచర్ సిటీకి పటిష్టమైన చట్టపరమైన రక్షణ - ఎవరొచ్చినా మార్చలేరు - రేవంత్ మాస్టర్ ప్లాన్ !
ఫ్యూచర్ సిటీకి పటిష్టమైన చట్టపరమైన రక్షణ - ఎవరొచ్చినా మార్చలేరు - రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Embed widget