అన్వేషించండి

KCR MK Stalin Meeting: యాదాద్రి ప్రారంభోత్సవానికి రండి.. ,. స్టాలిన్‌ను ఆహ్వానించిన కేసీఆర్ !

యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి రావాలని తమిళనాడు సీఎంను కేసీఆర్ ఆహ్వానించారు. కుటుంబసభ్యులతో కలిసి స్టాలిన్‌ను కలిశారు. దేశ రాజకీయాలు, కేంద్రం తీరుపైనా చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... తమిళనాడు సీఎం స్టాలిన్‌తో సమావేశమయ్యారు. చెన్నైలోని స్టాలిన్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్‌ స్టాలిన్‌ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా యాదాద్రి ఆలయ పునః ప్రారంభవేడుకలకు రావాల్సిందిగా స్టాలిన్‌ను సీఎం కేసీఆర్‌ ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది.  మార్చి 22న సుదర్శన యాగంతో ప్రారంభమయ్యే వేడుకలు 28న అర్ధరాత్రి ముగియనున్నాయి. ఆ వారం రోజుల్లో ఏదో ఒకరోజు వచ్చి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోవాలని స్టాలిన్‌ను కేసీఆర్‌ కోరినట్టు తెలుస్తోంది.
KCR MK Stalin Meeting: యాదాద్రి ప్రారంభోత్సవానికి రండి.. ,. స్టాలిన్‌ను ఆహ్వానించిన కేసీఆర్ !

Also Read: క్యాంపులతో పట్టు నిలుపుకున్న టీఆర్ఎస్.. ఖమ్మంలో క్రాస్ ఓటింగ్ !

ఇరువురు సీఎంలు రాష్ట్రాల హక్కులను కేంద్రం లాక్కుంటున్న అంశంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. వివిధ అంశాలపై ఇటీవల స్టాలిన్ కేంద్రంపై పోరాటం ప్రకటించారు. ఆయా అంశాల్లో కలిసి పోరాటం చేద్దామని దక్షిణాది ముఖ్యమంత్రులకూ లేఖలు రాశారు. ఆయా అంశాలపై వారు చర్చించినట్లుగా తెలుస్తోంది.  రాష్ట్రాల పట్ల కేంద్ర వైఖరి, సమాఖ్య స్ఫూర్తికి గండి కొడుతున్న తీరుపై ఇద్దరు సీఎంలు చర్చించారు. రాష్ట్రాల హక్కులను కాపాడుకునేందుకు అలుపెరుగని పోరాటం చేయాలని ఇరువురు అనుకున్నట్లుగా తెలుస్తోంది.
KCR MK Stalin Meeting: యాదాద్రి ప్రారంభోత్సవానికి రండి.. ,. స్టాలిన్‌ను ఆహ్వానించిన కేసీఆర్ !

Also Read: ‘‘టీఆర్ఎస్’ అంటే తిరుగులేని రాజకీయ శక్తి..’ ఎమ్మెల్సీ రిజల్ట్స్‌పై ఫుల్ ఖుషీలో నేతలు, కేటీఆర్ కూడా..

అదే సమయంలో ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య దేశ రాజకీయాలపైనా చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి విషయంలో చర్చలు జరిగినట్లుగా  టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రకటించారు. దేశంలో ప్రాంతీయ పార్టీలదే బలమైన శక్తి అని...ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు కొనసాగుతాయని వినోద్ కుమార్ ప్రకటించారు. ప్రస్తుతం స్టాలిన్ కాంగ్రెస్ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. కాంగ్రెస్‌కు కటిఫ్ చెప్పి ఆయన ప్రాంతీయ పార్టీల కూటమిలోకి వస్తారా లేదా అన్నది ముందు ముందు తేలే అవకాశం ఉంది. గతంలోనూ కేసీఆర్ ప్రాంతీయ పార్టీల కూటమి కోసం ఓ సారి చెన్నైలోనే స్టాలిన్‌ను కలిశారు.
KCR MK Stalin Meeting: యాదాద్రి ప్రారంభోత్సవానికి రండి.. ,. స్టాలిన్‌ను ఆహ్వానించిన కేసీఆర్ !

Also Read: TS MLC Election Results: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్.. అన్ని స్థానాలు గులాబీ కైవసం

కేసీఆర్ కుటంబ సమేతంగా స్టాలిన్‌ను కలిశారు. డీఎంకే ఎమ్మెల్యే, స్టాలిన్ కుమారుడు, సినీ నటుడు అయిన ఉదయనిధి ... మంత్రి కేటీఆర్‌తో సుదీర్ఘంగా మాట్లాడుతూ కనిపించారు. వివిధ అంశాలపై వారు తమ అభిప్రాయాలను కలబోసుకున్నట్లుగా తెలుస్తోంది. ఉదయనిధి రాజకీయ రంగంలోనూ బీజేపీపై విమర్శలు చేయడంలో తనదైన ప్రత్యేకత చూపిస్తూంటారు. డీఎంకే యూత్ వింగ్‌కు నేతృత్వం వహిస్తున్నారు. డీఎంకే పార్టీ నిర్మాణ అంశం వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ నిర్మాణానికి పనికొచ్చే అంశాలపై కేటీఆర్ మరింత సమాచారం సేకరించినట్లుగా తెలుస్తోంది. అంతకు ముందు  చెన్నైలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మాజీ గవర్నర్ నరసింహన్‌ను కేసీఆర్ పరామర్శించారు. 

Also Read: అబద్దాలతో బురిడీ కొట్టిస్తున్న శిల్పా చౌదరి - మరోసారి కస్టడీ కోరిన పోలీసులు !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Embed widget