అన్వేషించండి

CM Kcr: 'పాలమూరును నాశనం చేసింది కాంగ్రెస్' - ఆలోచించి ఓటెయ్యాలన్న సీఎం కేసీఆర్ 

Telangana election 2023: ఎన్నికల్లో ఓటర్లు పరిణతితో ఆలోచించి ఓటెయ్యాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. అభివృద్ధి, అభ్యర్థి చరిత్ర, విచక్షణతో ఓటేస్తేనే ప్రజాస్వామ్యం గెలుస్తుందన్నారు.

Telangana election 2023: ఎన్నికల్లో ఓటర్లు పరిణతితో ఆలోచించి ఓటెయ్యాలని, అలాంటప్పుడే ప్రజాస్వామ్యం గెలుస్తుందని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. దేవరకద్ర బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు రాగానే ప్రజలు గందరగోళానికి గురి కావొద్దని, పార్టీ చేసిన అభివృద్ధి, అభ్యర్థి చరిత్ర అన్నీ చూసి ఓటెయ్యాలని సూచించారు. ఓటును సరిగ్గా వాడితేనే బంగారు భవిష్యత్తు సొంతమవుతుందని స్పష్టం చేశారు. కృష్ణా, తుంగభద్ర నదులు పారే ఈ పాలమూరు జిల్లాను సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని ధ్వజమెత్తారు. అద్భుతమైన జిల్లాను సమైక్య రాష్ట్రంలో ఘోరమైన స్థితికి తెచ్చారని మండిపడ్డారు. వలసలు వెళ్లి బాధలు అనుభవించిన జిల్లా పాలమూరు అని అన్నారు. గత పాలకులు ఉమ్మడి జిల్లాలో గంజి కేంద్రాలు పెట్టారని, సమైక్య పాలనలో ఉన్న ప్రాజెక్టులను రద్దు చేశారని విమర్శించారు.

'కళ్ల ముందే అభివృద్ధి'

కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అభివృద్ధి మీ కళ్ల ముందే ఉందని కేసీఆర్ తెలిపారు. కరివెన రిజర్వాయర్ పనులు పూర్తి కావొచ్చాయని, అది అందుబాటులోకి వస్తే దేవరకద్ర నియోజకవర్గంలో మొత్తం 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసుకుని నీళ్లు తెచ్చుకున్నామని వివరించారు. పాలమూరు - రంగారెడ్డి పథకానికి అడ్డుంకులన్నీ తొలగిపోయాయని, త్వరలోనే నీళ్లన్నీ రాబోతున్నాయని స్పష్టం చేశారు. దేవరకద్ర నియోజకవర్గ అభ్యర్థి వెంకటేశ్వర రెడ్డి మంచి వ్యక్తని పట్టుబట్టి 30 చెక్ డ్యాంలు మంజూరు చేయించి లక్ష ఎకరాల్లో వరి పండించేలా చేశారని గుర్తు చేశారు. ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం గద్వాల సభకు బయలుదేరారు.

'గద్వాలను గబ్బు పట్టించారు'

గద్వాలను గబ్బు పట్టించిన వారెవరని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన, గద్వాల ప్రాంతానికి ఘన చరిత్ర ఉందని, ప్రపంచంలోనే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన జోగులాంబ అమ్మవారు కొలువైన ప్రాంతానికి ఆ పేరు పెట్టుకున్నామని వివరించారు. ఇక్కడ బోయ, వాల్మీకి సోదరులు ఎక్కువగా ఉంటారని, ఆంధ్రాలో వారు ఎస్టీలని, ఇక్కడ మాత్రం వారు బీసీలని చెప్పారు. తెలంగాణలో వాల్మీకి, బోయ తెగలను ఎస్టీల్లో కలిపేందుకు తాను ప్రయత్నించినట్లు గుర్తు చేశారు. దీనిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపించినా ఫలితం లేదని పేర్కొన్నారు. 'మాజీ సీఎం నీలం సంజీవరెడ్డి వాల్మీకి, బోయలకు అన్యాయం చేశారు. ఆనాడు వారిని ముంచింది కాంగ్రెస్ ముఖ్యమంత్రే. ఆర్డీఎస్ కాలువను ఆగం పట్టించిన పార్టీ కాంగ్రెస్సే' అని కేసీఆర్ పేర్కొన్నారు. 

ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని జిల్లా కేంద్రం చేసుకున్నామని, ఇవాళ నెట్టెంపాడు కింద లక్షా 60 వేల ఎకరాలను నీరు పారుతోందని కేసీఆర్ వివరించారు. ర్యాలంపాడు రిజర్వాయర్ పెద్దగా చేసి గద్వాలను పచ్చగా మార్చుకున్నామని, గట్టు మండలానికి నీళ్లు కావాలని ఎత్తిపోతల పథకం కూడా తెచ్చామని చెప్పారు. అన్ని రకాలుగా గద్వాల అభివృద్ధి జరిగిందని, ప్రజలకు మంచి చేయాలని అహర్నిశలు శ్రమిస్తోన్న బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణమోహన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Also Read: KA Paul: 30 సీట్లొచ్చినా తెలంగాణలో నేనే సీఎం, రెగ్యులర్‌గా టచ్‌లో రాహుల్ - కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget