CM Revanth Reddy: ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర - ఎక్కడంటే?
Telangana News: ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతాల్లో పాదయాత్ర చేయనున్నారు. రైతులు, ప్రజలను కలిసి వారి ఇబ్బందులను తెలుసుకోనున్నారు.

CM Revanth Reddy Padayatra: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ నెల 8న పాదయాత్ర చేయనున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా యాదాద్రి ఆలయంలో పూజలు చేయనున్నారు. అదే రోజు మూసీ పరివాహక ప్రాంతాల్లో పాదయాత్ర చేసే అవకాశం ఉంది. భువనగిరి నుంచి వలిగొండ వైపు పాదయాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల పైపులైన్లకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని రైతులు, ప్రజలను కలిసి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకోనున్నారు. సీఎం పర్యటన క్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హెలిప్యాడ్, ఆలయ పరిసరాలను పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. అటు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఆయనతో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు చర్చించారు.
మరోవైపు, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అధ్యక్షతన నిధుల సమీకరణపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఖజానాకు అదనపు నిధుల సమీకరణపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశంలో చర్చించారు.
Also Read: KTR Letter: తెలంగాణ సమాజాన్ని మోసం చేసినందుకు క్షమాపణలు చెప్పండి- రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ





















