అన్వేషించండి

Telangana: కులవృత్తులు, చేతి వృత్తుల వారికి రూ.1లక్ష ఆర్థిక సాయం, దరఖాస్తులు ప్రారంభం

Application Form for Financial Assistance for OBC Communities: బీసీ కులవృత్తులు, చేతి వృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం కోసం దరఖాస్తులను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది.

Telangana Application Form for Financial Assistance for BC Vocational Communities Registration Form
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బీసీ కులవృత్తులు, చేతి వృత్తులకు లక్ష రూపాయల ఆర్థికసాయం అందిస్తామని ఇటీవల కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోగా.. దరఖాస్తులు ప్రారంభించింది సర్కార్. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వారికి ఆర్థికసాయం పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 9వ తేదీన సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఆ రోజు మంచిర్యాలలో సీఎం కేసీఆర్ బీసీ కులవృత్తులకు ఆర్థికసాయాన్ని లాంఛనంగా అందజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కులవృత్తులు చేసుకునే లబ్దిదారులకు ఆర్థికసాయం పంపిణీ చేస్తారు.

కేబినెట్ సబ్ కమిటీ
చేతివృత్తులు, కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారిని మరింత ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన కేబినెట్ కమిటీ ఏర్పాటు కావడం తెలిసిందే. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి సభ్యులుగా ఉన్న ఈ సబ్ కమిటీ విశ్వబ్రాహ్మణులు, నాయి బ్రాహ్మణులు, రజకులు, మేదరి, కుమ్మరి తదితర వృత్తి కులాల వారికి ప్రోత్సాహకాలు అందించేలా విధివిధానాలు ఖరారు చేయాలని కేబినెట్ సబ్ కమిటీకి సీఎం ఆదేశించారు. ఈ సబ్ కమిటీ విధివిధానాలు ఖరారు చేస్తే దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పథకం అమలు చేయాలని సీఎం ఆదేశించారు.

కుల వృత్తులు, చేతివృత్తులు చేసుకునే వారికి రూ.1 లక్షల ఆర్థిక సాయం తెలంగాణ ప్రభుత్వం అందించనుండగా.. లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందకు వెబ్ సైట్ తీసుకొచ్చారు. అర్హులైన లబ్దిదారులు బీసీ సంక్షేమశాఖ వెబ్ సైట్  http://tsobmmsbc.cgg.gov.in/ లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెబ్​సైట్​ను సచివాలయంలో జరిగిన కార్యాలయంలో ప్రారంభించారు. కుల వృత్తులు చేసుకునే వారు ప్రభుత్వ నిబంధనల్ని పాటించి ఫొటో, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం ఆధారంగా ఆన్​లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. చేతివృత్తులు, కులవృత్తులు చేసుకునే వారికి అవసరమయ్యే పనిముట్లు, ముడిసరకు కొనుగోలు కోసం తెలంగాణ సర్కార్ లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించనుంది. బీసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ లో రూ.6,229 కోట్లను కేటాయించింది. 
అప్లికేషన్ కోసం డైరెక్ట్ లింక్ 

బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు..
సంక్షేమ పథకాలలో భాగంగా రైతు బంధు పేరుతో రైతులకు నేరుగా పంట పెట్టుబడి సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది. దళిత బంధు పథకంతో ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయంతో వారిని డెవలప్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. గీత కార్మికుల కష్టాన్ని గుర్తించిన బీఆర్ఎస్ ప్రభుత్వం వారి కోసం రూ.5 లక్షల పాలసీ తెచ్చింది. ఎవరైన కల్లు గీస్తూ ప్రమాదవశాత్తూ చనిపోతే ఆ కుటుంబసభ్యులకు ఈ ఆర్థిక సాయాన్ని అందజేస్తారు. రైతు చనిపోతే వారి కుటుంబసభ్యులకు రైతు బీమా పేరుతో ఐదు లక్షల నగదును అందించి అన్నదాత కుటుంబాన్ని ఆదుకుంటోంది ప్రభుత్వం. 

టాప్ హెడ్ లైన్స్

Cancel Free Bus Scheme: 'నా భార్య నన్ను వదిలేసి ఫ్రీ బస్సులో వెళ్లిపోయింది'.. ఆ పథకాన్ని రద్దు చేయండి - బాధితుడి ఆవేదన
'నా భార్య నన్ను వదిలేసి ఫ్రీ బస్సులో వెళ్లిపోయింది'.. ఆ పథకాన్ని రద్దు చేయండి - బాధితుడి ఆవేదన
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Jayesh Ranjan IAS to opts VRS | వరుస బదిలీలు.. జయేశ్‌ రంజన్‌ వీఆర్‌ఎస్‌ నిర్ణయం వేనుక కారణమేంటి!
Jayesh Ranjan | వరుస బదిలీలు.. జయేశ్‌ రంజన్‌ వీఆర్‌ఎస్‌ నిర్ణయం వేనుక కారణమేంటి!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget