Telangana News : గొర్రెల స్కీంలో స్కాంపై ఈడీ దృష్టి - తలసాని టార్గెట్ అవుతున్నారా ?
Sheep Scheme Scam Case : గొర్రెల స్కీమ్ స్కామ్‌లో తలసాని ఇరుక్కునే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసులో అక్రమ నగదు రవాణా జరిగిందని ఈడీ వివరాలు కోరుతోంది.
Talasani In Sheep Scheme Scam Case : తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత బయటపడిన గొర్రెల పంపిణీ స్కీమ్‌లో అక్రమ నగదు రవాణా జరిగిందని గుర్తించిన ఈడీ అధికారులు పూర్తి వివరాలు కావాలని తెలంగాణ సీఐడీ అధికారులకు లేఖ రాశారు. గొర్రెల స్కామ్ లో జరిగిన 700 కోట్ల అవినీతి జరిగిందని పెద్ద మొత్తం లో డబ్బు చేతులు మారినట్టు ఆధారాలను తెలంగాణ ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఏసీబీ నమోదు చేసిన వివరాలు ఆదారంగా ఈడీ పి ఏం ఎల్ ఏ యాక్ట్..(prevention of money laundering act )కింద గొర్రెల స్కామ్ పై విచారణ చేపట్టాలని నిర్ణయించింది.
స్కాంలో నగదు తరలింపుపై వివరాలు అడిగిన ఈడీ
గొర్రెల స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలు అందివ్వాలని పశు సంవర్ధక శాఖ అధికారులకు ఈడీ లేఖరాసింది. రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పంపిణీ పధకం లబ్ది దారుల వివరాలు, గొర్రెల కొనుగోలు కోసం ఏయే జిల్లాల్లో ఏ అధికారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అయింది.. ఎంత జమ చేశారు వంటి వివరాలను చెప్పాలని ఆదేశించింది. గొర్రెల రవాణాలో కాంట్రాక్టు కుదుర్చుకున్న ఏజెన్సీల వివరాలు ఈ కుంభ కోణానికి కారకులు ఎవరు.. ఎవరెవరి పాత్ర ఉంది.. రికార్డ్స్ లో తప్పుడు లెక్కలు వంటి వాటి వివరాలు కూడా కోరింది.
కేసీఆర్ చుట్టూ కేసులు, విచారణల వల - బీఆర్ఎస్‌కు మరింత గడ్డు కాలం తప్పదా ?
ఇప్పటికే ముగ్గుర్ని అరెస్టు చేసిన తెలంగాణ ఏసీబీ
రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ మాజీ సీఈవో, గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ రాంచందర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ కుమార్ లను ఇప్పటికే అరెస్టు చేశారు. వీరు ఈ కుంభ కోణానికి కారకులు ఎవరు.. ఎవరెవరి పాత్ర ఉంది.. రికార్డ్స్ లో తప్పుడు లెక్కలపై వారి నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. గొర్రెలు అమ్మిన రైతుల ఖాతాలకు కాకుండా ఇతర బినామీల ఖాతాలకు డబ్బు మళ్ళింపుపై వివరాలుసేకరిస్తున్నారు.
తెలంగాణలో ఆర్టీసీ టికెట్ ఛార్జీలు పెంచలేదు - కానీ పురుషుల జేబుకు చిల్లు, కారణం ఏంటంటే!
ఏడు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లుగా ఆరోపణలు
మనీలాండరింగ్ జరిగిందని ఈడీకి ఈ కేసులో ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. స్వచ్చందగా తెలంగాణ ఏసీబీ పోలీసులు నమోదు చేసిన కేసులో ఈడీ వివరాలు అడిగిందంటేనే ఓ సంకేతం స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయవర్గాలంటున్నాయి. తలసాని శ్రీనివాస్ యాదవ్ స్కాం జరిగినప్పుడు సంబంధిత మంత్రిగా ఉన్నారు. కేసు ఆయ నదగ్గరకే వెళ్తుందన్న చర్చ జరుగుతోంది. అరెస్టు అయిన ముగ్గురు వెల్లడించిన అంశాలతో త్వరలో మరికొందర్ని అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.