అన్వేషించండి

Singireddy Niranjan Reddy : అభినవ గోబెల్స్ అవార్డు ఇస్తే, అది రేవంత్ సర్కారుకు దక్కుతుంది - మాజీ మంత్రి సింగిరెడ్డి

Runa Mafi In Telangana: నిరంజన్ రెడ్డి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రైతు రుణమాఫీ పెద్ద మోసమని అన్నారు. అభినవ గోబెల్స్ అవార్డు ఇస్తే.. అది రేవంత్ సర్కారుకు దక్కుతుందని విమర్శించారు.

Singireddy Niranjan Reddy : కాంగ్రెస్ సర్కార్, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నిరంజన్ రెడ్డి తెలంగాణ భవన్‌లో రుణమాఫీ అమలు పై మీడియాతో మాట్లాడారు. రైతు రుణమాఫీ పెద్ద మోసమన్నారు. అభినవ గోబెల్స్ అవార్డు ఇస్తే.. అది రేవంత్ సర్కారుకు దక్కుతుందని విమర్శించారు.  దిల్ సుఖ్ నగర్ లో విమానాలు అమ్మడం ఎంత నిజమో... తెలంగాణలో భాక్రానంగల్ డ్యామ్ ఎంత వాస్తవమో.. తెలంగాణలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ అంతే నిజమన్నారు. ఎన్నికల సమయంలో రైతులందరికీ రుణమాఫీ చేస్తామని పదే పదే చెప్పారు. బడాయిల బచ్చిగానికి ఏడు దొడ్లు .. మూడు ఎడ్లు అన్నట్లు .. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, చేస్తున్న పనులకు తెలంగాణ ప్రజలు చెప్పుకునే ఈ మాటలు సరిగ్గా సరిపోతాయని నిరంజన్ రెడ్డి అన్నారు.

ప్రచార ఆర్భాటమే
డిసెంబరు 9న రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల  ప్రచారంలో చెప్పారు. జనవరి 6న ఓ మీడియా ఛానల్ తో ఒకటి, రెండు నెలలలో రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డే ప్రకటించారు. మూడు విడతలలో రూ.31 వేల కోట్లు ఆగస్ట్ లోపలే పూర్తి చేస్తానని జులై 18న ఆయన హామీ ఇచ్చారు.  జులై 28న అమెరికా వెళ్తూ రాగానే రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డే ప్రకటించారు. కానీ ఆగస్ట్ 15న రూ.17,869 వేల కోట్లు రుణమాఫీ చేశామని చెప్పుకున్నారు. ఆగస్ట్ 15 నాటికి అందరి రైతుల రుణాలు మాఫీ అవుతాయని రేవంత్ ప్రకటించారని నిరంజన్ రెడ్డ గుర్తు చేశారు. మరి రూ.31 వేల కోట్లకు కేవలం 17 వేల కోట్లతో రుణమాఫీ ఎలా పూర్తవుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఉచిత బస్సు మినహా ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదన్నారు. ఆరు గ్యారంటీలు గడువులోగా అమలు చేస్తే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు సవాల్ చేశారు. ఆ విషయాన్ని రుణమాఫీ చుట్టూ తిప్పి అరకొరగా అమలుచేసి రుణమాఫీ అయిపోయిందని దబాయిస్తూ రాజీనామా చేయాలని దుర్భాషలాడడం సరికాదని హితవు పలికారు. 

బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు
రాష్ట్రంలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత హరీష్ రావు. ఏ బ్యాంకులో రైతుల రుణాలు మాఫీ అయ్యాయో సర్కారు చెబుతుందా ? రుణమాఫీ అయిపోతే రాష్ట్రంలో రైతులు ఎందుకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని నిరంజన్ రెడ్డ ప్రశ్నించారు. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఉండగా 60 లక్షల మంది రుణాలు తీసుకున్నారు .. ప్రభుత్వం 44 లక్షల మంది అని లెక్కలు చెబుతుంది .. మరి ప్రభుత్వం ఎందుకు 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ ఎందుకు చేసింది ? అని ఆయన నిలదీశారు. అసలుకంటే కొసరు ఎక్కువ అన్నట్లు రుణమాఫీపై మీడియా ప్రకటనలకే రూ.300 కోట్లు వరకు ఖర్చు చేశారుజ బీఆర్ఎస్ పాలనలో రూ.29 వేల కోట్లు రుణమాఫీ, రూ.72 వేల కోట్లు రైతుబంధు పథకం కింద రైతులకు అందజేసి అండగా నిలిచామన్నారు. 


రైతు భరోసా ఎగ్గొట్టారు
కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం రైతుభరోసా విడత కింద ఒక్కసారికి రూ.15 వేల కోట్లు అవసరం అవుతుంది .. రైతుభరోసా ఎగ్గొట్టి రూ.17 వేల కోట్లు రుణమాఫీ చేసి రైతులను మోసం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం  రైతులను,  ఉపాధి హామీ కూలీలను వెన్నుపోటు పొడిచిందన్నారు. ఆసరా ఫించను దారులను వెన్నుపోటు పొడిచింది .. నిరుద్యోగులను వాడుకుని ఓట్లేయించుకుని నిరుద్యోగ  భృతి ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచిందన్నారు.  గ్రామ పంచాయతీలతో పారిశుద్ద కార్మికులకు, పాఠశాలలో వంట కార్మికులకు  వేతనాలు రాక గ్రామాలలో తండ్లాడుతున్నారు. మహాలక్ష్మి పథకం కింద రూ.2500 అని చెప్పి ఆ పథకం గురించిన ఊసే లేదన్నారు.  మాట మీద నిలబడిన హరీష్ రావును రాజీనామా చేయమనడం హస్యాస్పదమన్నారు. 

రాహుల్ మాటలు ఆర్థం కాలేదు
పార్లమెంటులో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో  చాలా విషయాలలో చక్కగా వ్యవహరిస్తున్నాడు ...మరి అదే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి తెలంగాణలో ఎదుటి వ్యక్తులను అడ్డగోలుగా మాట్లాడుతున్నారు ... తూలనాడుతున్నారు. రాహుల్ గాంధీ మాట్లాడే హిందీ, ఇంగ్లీష్ భాషలు చాల చక్కగా ఉంటాయి .. అవి రేవంత్ కు అర్ధంకానట్లుంది .. అందుకే అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. కేంద్రంలో ప్రతిపక్షం ప్రశ్నిస్తే అధికార పక్షం నెహ్రూ, ఇందిరల గురించి మాట్లాడుతారు.   తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే గత పదేళ్లలో వందేళ్ల విధ్వంసం అని అడ్డగోలు వాదనకు దిగుతారు. ప్రపంచబ్యాంకుతో మాట్లాడిన సీఎంకు తెలంగాణలో ఉన్న బ్యాంకు అధికారులతో మాట్లాడి ఏ రైతుకు రుణమాఫీ జరిగిందో చెప్పడానికి సమయం లేదా ? రైతుభరోసాపై క్యాబినెట్ సబ్ కమిటీ, చర్చలు, శాసనసభలో చర్చలన్నీ పక్కకు పోయాయి ..జులై 15కు నివేదిక అన్నారు .. ఆగస్ట్ 15 వచ్చినా గతి లేదన్నారు.

 
కృష్ణా నీటిని ఒడిసి పట్టలేకపోయారు
 క్రిష్ణానదిలో పోతున్న నీటిని వడిసిపట్టుకునే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. పాలమూరు జిల్లాలో కుంటలు, చెరువులు వెలవెలబోతున్నాయి .. కట్టిన రిజర్వాయర్లను నింపుకునే సోయి ప్రభుత్వానికి లేదు. గత ఎనిమిది నెలలలో తట్టెడు మట్టి తియ్యకుండా పనులు పక్కన పెట్టారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి పథకంలో మూడు రిజర్వాయర్లలో 28 టీఎంసీల వరకు నిల్వ చేసుకునే అవకాశం ఉన్నా గాలికి వదిలేశారన్నారు. రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు .. గత ప్రభుత్వంలోనే సిద్దం చేసిన పంపును కూడా వాడుకునే ఉద్దేశం లేదన్నారు.  కేసీఆర్ సిద్దం చేసిన ప్రాజెక్టులను వాడుకోవడం పట్ల అశ్రద్ద చేస్తున్నారు. రైతుల మంచితనం, అమాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఒక మూల పెట్టుబడిగా మారింది .. ఆశపడ్డ రైతులను అమాంతం వంచించారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రైతుల పరిస్థితి ధీనంగా ఉంది .. ప్రజల పట్ల ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తుంది 

 
వాట్సప్ కు 1,11,027 ఫిర్యాదులు
రుణమాఫీ అయిన 22 లక్షల మంది రైతులను కదిలించినా రైతుబంధు ఎగ్గొట్టి రుణమాఫీ చేశాడు .. కరెంటు లేదు, నీళ్లు లేవు అనే చెబుతున్నారని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇతరులను చిన్నబుచ్చి మాట్లాడినంత మాత్రాన గొప్పోళ్లు కాలేరు .. వాళ్లకన్నా గొప్ప పనులు చేస్తే గొప్పవాళ్లు అవుతారు. ఈ శతాబ్దానికి సరిపడినంత మోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతాంగానికి చేసింది. రుణమాఫీపై బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ కు ఇప్పటి వరకు 1,11,027 వాట్సప్ ఫిర్యాదులు వచ్చాయి. బీఆర్ఎస్ కాల్ సెంటర్ కు వచ్చిన ఫిర్యాదులను సీఎం కార్యాలయానికి పంపిస్తామని నిరంజన్ రెడ్డి తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs AUS 3rd Test Match: డ్రాగా ముగిసిన
డ్రాగా ముగిసిన "గబ్బా" టెస్టు - 1-1తో సిరీస్‌ సమానం- కపిల్ రికార్డు బ్రేక్ చేసిన బుమ్రా
Zika Virus In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs AUS 3rd Test Match: డ్రాగా ముగిసిన
డ్రాగా ముగిసిన "గబ్బా" టెస్టు - 1-1తో సిరీస్‌ సమానం- కపిల్ రికార్డు బ్రేక్ చేసిన బుమ్రా
Zika Virus In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Vidudala OTT: డిసెంబర్ 20న విజయ్ సేతుపతి ‘విడుదల 2’... ఓటీటీలో ఫ్రీగా ప్రీక్వెల్ చూసేయండి - ఎందులోనో తెలుసా?
డిసెంబర్ 20న విజయ్ సేతుపతి ‘విడుదల 2’... ఓటీటీలో ఫ్రీగా ప్రీక్వెల్ చూసేయండి - ఎందులోనో తెలుసా?
Embed widget