By: ABP Desam | Updated at : 29 Dec 2021 06:36 PM (IST)
హరీష్ రావును ప్రజానాయకుడన్న శేఖర్ కమ్ముల
సున్నితమైన సినిమాలు తీయడంలో దర్శకుడు శేఖర్ కమ్ముల స్టైలే వేరు. ఆయన మనసు అంతే సున్నితం కాబట్టి.. అంతే విధంగా భావోద్వేగాలకు గురవుతారు కాబట్టి వాటిని తెర మీద ఆవిష్కరిస్తూ ఉంటారు. అందుకే ఆయనను అందరూ ఎమోషనల్ అంటూ ఉంటారు. ఓ లీడర్ సినిమా చూసినా.. ఇటీవల వచ్చిన లవ్ స్టోరీ అయినా సామాజిక సమస్యలపైనా తన దృక్పథాన్ని స్పష్టంగా వెల్లడించారు. అలాంటి దర్శకుడు హఠాత్తుగా మంత్రి హరీష్ రావును ప్రశంసలతో ముంచెత్తారు. ఆయనను ప్రజా నాయకుడిగా అభివర్ణించారు.
శేఖర్ కమ్ముల .. హరీష్ రావును ప్రశంసిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Thank you @trsharish gaaru ....#harishrao #niims pic.twitter.com/S8QqvuGVAT
— Sekhar Kammula (@sekharkammula) December 29, 2021
Also Read: న్యూఇయర్ వేడుకలపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్.. రేపు విచారణ, ఆదేశాలపై ఉత్కంఠ!
వరంగల్ కు చెందిన హర్షవర్ధన్ అనే యువకుడు క్రాన్ అనే అరుదైన వ్యాధికి గురయ్యాడు. దీనికి చికిత్స అత్యంత ఖరీదుతో కూడుకున్నది. ఏం చేయాలో తెలియక హర్షవర్ధన్ శేఖర్ కమ్ముల సాయాన్ని కోరారు. శేఖర్ కమ్ముల వెంటనే ఈ యువకుడి పరిస్థితిని మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు. శేఖర్ కమ్ముల విజ్ఞప్తిపై స్పందించిన హరీష్ రావు నిమ్స్ లో హర్షవర్ధన్ కు చికిత్స అందించేలా ఆదేశాలు ఇచ్చారు. హర్షవర్ధన్‌కు చికిత్స ఉచితంగా జరుగుతోంది. ఇప్పుడు ఆ యువకుడు కోలుకుంటున్నాడు.
Also Read: బీజేపీ అధికారంలోకి వస్తే.. 70 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తాం.. అన్ని కుదిరితే 50కే..
అడిగిన వెంటనే స్పందించినందుకు.. ఓ యువకుడి ప్రాణాలు కాపాడిన హరీష్ రావుకు సోషల్ మీడియా ద్వారా దర్శకుడు శేఖర్ కమ్ముల కృతజ్ఞతలు తెలిపారు. హరీష్ రావుని ప్రజల మంత్రి అని పిలిచేందుకు ఇలాంటి ఎన్నో కారణాలు చెప్పుకోవచ్చని శేఖర్ కమ్ముల తన ట్వీట్ లో పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ కూడా ఇలా వివిధ రకాల సాయం అవసరైన వారు ట్విట్టర్ ద్వారా సంప్రదిస్తే ఎంతో మందిని ఆదుకున్నారు.
Also Read: KTR: కొంప ముంచుతున్న సోము వీర్రాజు వ్యాఖ్యలు.. దేశమంతా వైరల్, కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Petrol-Diesel Price 06 December 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Telangana New Cabinet: 18 మంత్రి పదవుల కోసం 30 మంది నేతల పోటీ - జట్టు కూర్పుపై రేవంత్ కసరత్తు
Breaking News Live Telugu Updates: మంత్రివర్గం కూర్పుపై ఢిల్లీలో రేవంత్ చర్చలు
Michaung Cyclone Effect On Telangana: తెలంగాణపై మిగ్‌జాం ప్రభావం- రికార్డుస్థాయిలో వర్షాలు- నేడూ జల్లులు
Telangana Elections 2023 : బ్యాలెన్స్ తప్పిన సామాజిక న్యాయం - తెలంగాణ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగిందా ?
Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
Venu Swamy: వరుణ్ తేజ్, లావణ్య కలిసుండే అవకాశాల్లేవ్ - వాళ్ళిద్దరి జాతకాలపై వేణు స్వామి సంచనల వ్యాఖ్యలు
Telangana New CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి..కార్యకర్తల సంబరాలు | ABP Desam
నేను అమ్ముడుపోయానా..? రేవంత్ రెడ్డి ఎమోషనల్...!
/body>